NTV Telugu Site icon

Lucky Dreams: మీ కలలో ఆ స్త్రీ కనిపిస్తే.. నోట్ల వర్షం కురవడం పక్కా!

Lucky Dreams

Lucky Dreams

If you See These Things in Your Dream You will become Rich: నిద్రలో కలలు రావడం సర్వసాధారణం. మనం ఉదయం అంతా ఏ విషయం గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తామో.. అదే కల రూపంలో వస్తుంది. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం.. ప్రతి కలకి ఓ అర్థం ఉంటుంది. కొన్ని కలలు భవిష్యత్తులో మీకు ఏం జరగబోతోందనే సందేశాన్ని ఇస్తాయి. కొన్ని కలలు మిమ్మల్ని ధనవంతులను చేసేవి కూడా ఉంటాయి. కాబట్టి కలలో కొన్నింటిని చూడటం అదృష్టంగా పరిగణించబడుతుంది. కలల శాస్త్రం ప్రకారం ఏవి మంచివో ఇప్పుడు తెలుసుకుందాం.

ఖాళీ పాత్ర:
స్వప్న శాస్త్రం ప్రకారం.. కలలో ఖాళీ పాత్రను చూడటం శుభప్రదంగా పరిగణించబడుతుంది. కలలో ఖాళీ పాత్ర కనిపిస్తే.. ఇంట్లోకి లక్ష్మి రాకను సూచిస్తుంది. అంతేకాదు మీ ఇంటి నుంచి ప్రతి సమస్యను తొలగిపోతుంది.

గులాబీలు:
డ్రీమ్ సైన్స్ ప్రకారం.. కలలో గులాబీ పువ్వు కనిపిస్తే అదృష్టం త్వరలోనే మమ్మల్ని వరిస్తుంది. లక్ష్మిదేవి ఆశీస్సులు మీకు ఉంటాయి. దాంతో మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి.

చిలుక:
స్వప్న శాస్త్రం ప్రకారం కలలో చిలుక కనిపిస్తే చాలా శుభ సంకేతం. కలలో చిలుక కనిపిస్తే ఇంట్లో డబ్బుల వర్షం కురుస్తుందని స్వప్న శాస్త్రం చెబుతోంది.

Also Read: Flipkart New Sale: మరో సేల్‌ను ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్.. ఏకంగా 80 శాతం డిస్కౌంట్స్!

దేవుడు:
డ్రీమ్ సైన్స్ ప్రకారం మనకు కలలో దేవుడు లేదా దేవతలు కనిపిస్తే చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అన్ని పనుల్లోనూ విజయం సాధించబోతున్నారని అర్థం.

ఏడవడం:
స్వప్న శాస్త్రం ప్రకారం.. మీరు కలలో ఏడుస్తున్నట్లు కనిపిస్తే చాలా మంచిదని భావిస్తారు. త్వరలో మీరు సంతోషాన్ని పొందుతారని సూచిస్తుంది.

స్త్రీ:
డ్రీమ్ సైన్స్ ప్రకారం మీ కలలో వృద్ధురాలు కనిపిస్తే.. మీరు ధనవంతులు కాబోతున్నారని అర్థం. అంతేకాదు సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది.

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ntvtelugu.com దీన్ని ధృవీకరించలేదు.)

 

Show comments