Site icon NTV Telugu

Vande Bharat Express: మళ్లీ వందేభారత్ రైలు ఆగిపోయింది.. మొన్న గేదెలు, నిన్న ఆవు, మరి నేడేమో..

Vande Bharat

Vande Bharat

Vande Bharat Express: ఇటీవల పశువులను ఢీకొన్న ఘటనలతో వార్తల్లో నిలిచిన సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ మరోసారి వార్తల్లో నిలిచింది. అప్పుడు రైలు డ్యామేజ్ అయితే తాజాగా రైలు చక్రాల వద్ద సమస్య వచ్చింది. ఇటీవల ప్రధాని చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ రైలుకు రోజుకొక కష్టం వచ్చిపడుతోంది. మొన్న గేదెలను ఢీకొనడంతో రైలు ముందు భాగం డ్యామేజ్ అయింది. నిన్న ఆవును ఢీకొట్టింది. ఇవాళ తాజాగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు వీల్ జామ్ అయింది. ఢిల్లీ నుంచి వారణాసి ప్రయాణిస్తున్న రైలులోని సీ8 కోచ్ వద్ద బేరింగ్‌ల లోపం ఉన్నట్లు గుర్తించారు అధికారులు. వెంటనే రైలును ఆపించారు. ఎలాంటి ప్రమాదం జరగకున్నా ఈ తరహా వరుస ఘటనలతో రైలు నాణ్యతపై ప్రయాణికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Amit Shah: ఐదేళ్లలో అస్సాంను వరదలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం..

ఈ రైలు ఢిల్లీ నుంచి వారణాసి వెళుతుండగా, ఓ బోగీ చక్రం బిగుసుకుపోయింది. దన్ కౌర్, వాయిర్ రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఎక్స్ ప్రెస్ రైలు సీ8 కోచ్ లో వీల్ జామ్ అయినట్టు గుర్తించారు. ట్రాక్షన్ మోటార్‌లో బేరింగ్ లోపం వల్లే ఇలా జరిగినట్టు భావిస్తున్నారు. ఈ లోపాన్ని గుర్తించిన రైల్వే గ్రౌండ్ స్టాఫ్ రైల్వే ఆపరేషన్స్ విభాగానికి సమాచారం అందించారు. వరుసగా మూడో రోజు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావడం పట్ల సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వస్తున్నాయి. ఆ రైలులోని ప్రయాణికులను శతాబ్ధి రైలులో తరలించారు.

Exit mobile version