NTV Telugu Site icon

Lucifer 2 Empuraan : ఎంపురాన్ ఫస్ట్ లుక్ రిలీజ్..యాక్షన్ మోడ్ లో మోహన్ లాల్..

Whatsapp Image 2023 11 11 At 6.58.10 Pm

Whatsapp Image 2023 11 11 At 6.58.10 Pm

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లుసిఫర్ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ సినిమా లో మంజు వారియర్ , వివేక్ ఒబెరాయ్, టోవినో థామస్, ప్రధాన పాత్రల్లో నటించారు.ఈ సినిమా కు మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించాడు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం 2019 లో విడుదల అయి బిగ్గెస్టు బ్లాక్ బస్టర్‌ విజయం సాధించింది. ఇక ఇదే సినిమాను మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్‌ పేరుతో తెలుగు లో రీమేక్ చేశారు.తెలుగులో కూడా ఈ సినిమా మంచి విజయం సాధించింది… కాగా ఈ చిత్రం నుంచి సీక్వెల్ వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. లుసిఫర్ 2 ఎంపురాన్ అనే టైటిల్‌ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

ఇదిలా ఉంటే దీపావళి కానుకగా ఈ మూవీ నుంచి మేకర్స్ సాలిడ్ అప్‌డేట్‌ను అందించారు.ఈ మూవీ నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు, ఇక ఫస్ట్ లుక్ గమనిస్తే.. గన్ పట్టుకుని మోహన్ లాల్ హెలికాప్టర్ వైపు చూస్తున్నట్లు ఫుల్ యాక్షన్ మోడ్‌లో ఉంది. ఇక సీక్వెల్‌ కు కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం చేయనుండగా మురళి గోపి స్టోరీ అందిస్తున్నాడు. కాగా ఇందులో సూపర్ స్టార్ మోహన్ లాల్ మరింత స్టైలిష్‏గా కనిపించనున్నట్లు సమాచారం. పృథ్విరాజ్‌కు దర్శకుడిగా ఇది మూడో సినిమా. ఆయన తెరకెక్కించిన మూడు సినిమాల్లో మోహన్‌లాల్ హీరోగా ఉండటం విశేషం. ఇక ఈ సీక్వెల్ మూవీ ని లైకా సంస్థ గ్రాండ్ గా తెరకెక్కిస్తుంది.స్పీడ్ గా షూటింగ్‌ను పూర్తి చేసి వచ్చే ఏడాది పాన్‌ ఇండియా లెవల్లో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్స్ వేస్తున్నారు..ఇటీవలే జైలర్ సినిమా లో మోహన్ లాల్ కీలక పాత్రలో నటించి మెప్పించాడు..

Show comments