Lucifer 2 Empuraan : ఎంపురాన్ ఫస్ట్ లుక్ రిలీజ్..యాక్షన్ మోడ్ లో మోహన్ లాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లుసిఫర్ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ సినిమా లో మంజు వారియర్ , వివేక్ ఒబెరాయ్, టోవినో థామస్, ప్రధాన పాత్రల్లో నటించారు.ఈ సినిమా కు మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించాడు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం 2019 లో విడుదల అయి బిగ్గెస్టు బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇక ఇదే సినిమాను మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ పేరుతో తెలుగు లో రీమేక్ చేశారు.తెలుగులో కూడా ఈ సినిమా మంచి విజయం సాధించింది… కాగా ఈ చిత్రం నుంచి సీక్వెల్ వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. లుసిఫర్ 2 ఎంపురాన్ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
ఇదిలా ఉంటే దీపావళి కానుకగా ఈ మూవీ నుంచి మేకర్స్ సాలిడ్ అప్డేట్ను అందించారు.ఈ మూవీ నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు, ఇక ఫస్ట్ లుక్ గమనిస్తే.. గన్ పట్టుకుని మోహన్ లాల్ హెలికాప్టర్ వైపు చూస్తున్నట్లు ఫుల్ యాక్షన్ మోడ్‌లో ఉంది. ఇక సీక్వెల్ కు కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం చేయనుండగా మురళి గోపి స్టోరీ అందిస్తున్నాడు. కాగా ఇందులో సూపర్ స్టార్ మోహన్ లాల్ మరింత స్టైలిష్‌గా కనిపించనున్నట్లు సమాచారం. పృథ్విరాజ్‌కు దర్శకుడిగా ఇది మూడో సినిమా. ఆయన తెరకెక్కించిన మూడు సినిమాల్లో మోహన్‌లాల్ హీరోగా ఉండటం విశేషం. ఇక ఈ సీక్వెల్ మూవీ ని లైకా సంస్థ గ్రాండ్ గా తెరకెక్కిస్తుంది.స్పీడ్ గా షూటింగ్‌ను పూర్తి చేసి వచ్చే ఏడాది పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్స్ వేస్తున్నారు..ఇటీవలే జైలర్ సినిమా లో మోహన్ లాల్ కీలక పాత్రలో నటించి మెప్పించాడు..
Also Read
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!