NTV Telugu Site icon

LTTE Chief Prabhakaran: ప్రభాకరన్ బతికే ఉన్నాడు.. త్వరలోనే బయటికి వస్తాడు

Prabhakaran

Prabhakaran

LTTE Chief Prabhakaran: ప్రపంచ తమిళ సమాఖ్య అధ్యక్షుడు, కాంగ్రెస్ మాజీ నేత నెడుమారన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ ఇంకా బతికే ఉన్నారంటూ పెద్ద బాంబు పేల్చారు. ప్రభాకరన్ సజీవంగా ఉన్నారని, క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని త్వరలో బహిరంగంగా కనిపిస్తారని పేర్కొన్నారు. తంజావూరులో ముల్లివైక్కల్ మెమోరియల్ లో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళుల మెరుగైన జీవనం కోసం ఒక ప్రకటన చేయబోతున్నారని ఆయన తెలిపారు.

Read Also: Dhananjay Munde : 101జేసీబీలు, 10టన్నుల పూలు.. గ్రాండ్ ఎంట్రీ అదిరిందయ్యా

ప్రభాకరన్ అనుమతితోనే తాను ఈ ప్రకటన చేస్తున్నానన్నారు. కుటుంబ సభ్యులతో ప్రభాకరన్ టచ్ లో ఉన్నారని నెడుమారన్ చెప్పారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని తెలిపారు. అయితే ప్రభాకరన్ ఎక్కడ ఉన్నారో ఆ విషయాన్ని తాను ఇప్పుడు వెల్లడించలేనని చెప్పారు. మరోవైపు ప్రభాకరన్ చనిపోయారంటూ 2009 మే 18న శ్రీలంక ఆర్మీ ప్రకటించింది. ప్రభాకరన్ మృతదేహం ఫొటోలను కూడా విడుదల చేసింది. ప్రభాకరన్ కుమారుడు కూడా చనిపోయాడని తెలిపింది. ముల్లైతీవు ప్రాంతంలో శ్రీలంక సైన్యంతో జరిగిన పోరులో ప్రభాకరన్ చనిపోయారని వెల్లడించింది.

Read Also: Butterfly Pea flower: చర్మం వదులుగా అవుతుంటే.. శంకుపుష్పంతో చెక్‌..

శ్రీలంకలో ఇటీవల చోటుచేసున్న ప్రజా తిరుగుబాటు, రాజపక్ష దేశాధ్యక్ష పదవికి రాజీనామా చేసి, విదేశాలకు పారిపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో… ప్రభాకరన్ మళ్లీ బయటకు రావడానికి ఇదే సరైన సమయమని ఆయన చెప్పారు. ప్రభాకర్ కు ఈలం తమిళులు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమిళులు సంపూర్ణ మద్దతును పలకాలని కోరారు. ప్రభాకర్ కు తోడుగా తమిళనాడు ప్రభుత్వం, తమిళ రాజకీయ పార్టీలు, తమిళనాడు ప్రజలు నిలవాలని అన్నారు. ఇన్నేళ్ల తర్వాత ప్రభాకరన్ బతికే ఉన్నారంటూ నెడుమారన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో కలకలం రేపుతున్నాయి.