మన పల్లెటూర్లలో చాలా చోట్ల కనిపించే మొక్క శంకు మొక్క. పాకుతూ పోయే ఈ మొక్కకు పూసే నీలి రంగు శంకుపుష్పాలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

శంకుపుష్పం లేదా బటర్‌ఫ్లై పీ ఫ్లవర్ లేదా డార్విన్ పీ ఫ్లవర్ అనేది... పాకుతూ పెరిగే మొక్క. 

సాధారణంగా దీన్ని డెకరేషన్ కోసం పెంచుతుంటారు. ఐతే... ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. 

దీని ఆకులు, వేర్లు, విత్తనాలు, పువ్వులు అన్నింటినీ ఆయుర్వేదంలో రకరకాల వ్యాధుల నివారణకు వాడుతారు. 

పురాతన కాలం నుంచీ ఈ శంకు పుష్పాలను సంప్రదాయ మందుల్లో వాడుతున్నారు. 

ఇది బ్రెయిన్‌కి టానిక్‌లా పనిచేసి మెమరీ పవర్‌, తెలివితేటల్ని పెంచుతుంది. కళ్లు, గొంతులో సమస్యల్ని నివారిస్తుంది. 

చర్మం, మూత్ర సంబంధ వ్యాధుల్ని కూడా ఇది నయం చేస్తుంది. ఒత్తిడి, నీరసం, మతిమరపు, నిద్ర లేమి, కంటి చూపు సమస్యలు, జుట్టు రాలిపోవుట, చర్మం వదులుగా అవ్వుట వంటి సమస్యలు వస్తుంటే ఈ పూలను ఉపయోగించడం సరైన పరిష్కారం. 

వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్, పెప్టైడ్స్ మంచి ఫలితాల్ని ఇస్తున్నాయి. 

మీకు తెలిసే ఉంటుంది చాలా వంటల్లో కలర్ కోసం ఈ పువ్వుల్ని వాడుతారు. వీటిని పిండిలో ముంచి ఫ్రై చేసి తింటారు. 

ఇది బ్రెయిన్‌కి టానిక్‌లా పనిచేసి... మెమరీ పవర్‌, తెలివితేటల్ని పెంచుతుంది. కళ్లు, గొంతులో సమస్యల్ని నివారిస్తుంది. 

అలాగే వీటితో టీ, షర్బత్ కూడా చేస్తారు. కాబట్టి ఈసారి నర్సరీకి వెళ్తే ఈ మొక్క తెచ్చుకోండి.