NTV Telugu Site icon

LSG vs MI: హాఫ్ సెంచరీలతో మెరిసిన మిచెల్ మార్ష్, మార్క్‌రమ్.. ముంబై టార్గెట్ 204

Lsg Vs Mi (1)

Lsg Vs Mi (1)

LSG vs MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో భాగంగా లక్నో ఎకానా క్రికెట్ స్టేడియంలో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్లి కోల్పోయి 203 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. అయితే, లక్నో బ్యాట్స్‌మెన్లు మెరుగైన ప్రదర్శన చేసి తమ జట్టును బలమైన స్థితిలో నిలిపారు. లక్నో ఇన్నింగ్స్‌ను మిచెల్ మార్ష్ 60 పరుగులతో శరవేగంగా ఆరంభించాడు. అతను 31 బంతుల్లో 9 బౌండరీలు, 2 సిక్సర్లతో ధనాధన్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. మరోవైపు అజీదెన్ మార్క్‌రమ్ 53 పరుగులు చేసి జట్టును ముందుకు నడిపించాడు. మార్క్రమ్ 38 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన నికోలస్ పూరన్ (12), రిషబ్ పంత్ (2) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. అయితే అయుష్ బదోని (30 పరుగులు) మంచి ఇన్నింగ్స్ ఆడాడు. డేవిడ్ మిల్లర్ (27 పరుగులు, 14 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) చక్కటి ఫినిషింగ్ ఇచ్చాడు.

Also Read: Physical Harassment : ప్రభుత్వ ప్రధానోపాధ్యాయునిపై లైంగిక వేధింపుల ఆరోపణలు

ముంబై ఇండియన్స్ బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శన చేశాడు. అతను 4 ఓవర్లలో 36 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. లక్నో టాప్ బ్యాట్స్‌మెన్లను పెవిలియన్‌కు పంపించి, ముంబైని గేమ్‌లో నిలబెట్టేందుకు ప్రయత్నించాడు. విక్నేష్ పుత్తూర్, ట్రెంట్ బౌల్ట్, అశ్వనీ కుమార్ తలో ఒక వికెట్ తీసుకున్నారు. లక్నో సూపర్ జెయింట్స్ 204 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించడంతో ముంబై ఇండియన్స్‌కు గెలవాలంటే తమ బ్యాట్స్‌మెన్ మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంది.