Site icon NTV Telugu

IPL 2024: అంత మంది సీఎస్కే ఫ్యాన్స్ మధ్య ఆ ‘ఒక్కడు’.. ఇది కదా ఎంజాయ్ అంటే..!

Fan

Fan

మంగళవారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో చెన్నైపై లక్నో సూపర్ జెయింట్స్ భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్ సీఎస్కే విజయం సాధిస్తుందని అనుకున్నప్పటికీ, మార్కస్ స్టోయినీస్ అజేయ సెంచరీతో లక్నో విజయం సాధించింది. 211 పరుగుల లక్ష్యాన్ని లక్నో జట్టు మరో 3 బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేసింది. దీంతో.. చెన్నై ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. లక్నో బ్యాటింగ్ లో స్టోయినీస్ వీరబాదుడు బాదుతుంటే.. సీఎస్కే అభిమానుల ముందు ఒకే ఒక్క లక్నో ఫ్యాన్ మాత్రం తెగ ఎంజాయ్ చేశాడు. ఇప్పుడు అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

ఈ మ్యాచ్ చెన్నైలో జరగడంతో సీఎస్‌కేకి భారీ సంఖ్యలో ప్రేక్షకులు తరలివచ్చారు. మ్యాచ్‌ని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎక్కడ చూసినా CSK అభిమానులు మాత్రమే కనిపించారు. అయితే, లక్నో సూపర్ జెయింట్స్ అభిమానులు కూడా స్టేడియంలో ఉన్నారు. లక్నో విజయానికి దగ్గరవుతున్న కొద్దీ చాలా మంది చెన్నై ఫ్యాన్స్ మధ్యలో అతనొక్కడే లేచి గంతులేస్తూ.. స్టెప్పులేశాడు. స్టేడియం మొత్తం పసుపు సంద్రాన్ని తలపించినప్పటికీ, సీఎస్కే మ్యాచ్ ఓడిపోవడంతో చాలా డిస్సాపాయింట్ అయ్యారు. ఈ మ్యాచ్‌లో లక్నో గెలవగానే వెంటనే లేచి నిలబడి తెగ ఎంజాయ్ చేశాడు. అతనిని చూసిన సీఎస్కే అభిమానులందరూ నిరాశ చెందారు. ఈ సన్నివేశం కెమెరా కంట్లో చిక్కడంతో ఈ వీడియో వైరల్ అవుతుంది.

 

https://twitter.com/YashR066/status/1782831657944244276

Exit mobile version