Site icon NTV Telugu

LSD Trailer: ఓటీటీకి సైకలాజికల్ థ్రిల్లర్‌ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Lsdd

Lsdd

ఈ మధ్య సినిమాల కన్నా వెబ్ సిరీస్ లు బాగా పాపులర్ అవుతున్నాయి.. స్టార్ హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్ లలో నటిస్తూ అభిమానులను అల్లరిస్తున్నారు.. ముఖ్యంగా థ్రిల్లింగ్, సస్పెన్స్ కథలతో వస్తున్న వెబ్ సిరీస్ లు ఓటీటీ లో ఎక్కువగా విడుదల అవుతున్నాయి.. తాజాగా ఓటీటీలోకి మరో సైకలాజికల్ థ్రిల్లర్‌ సిరీస్ ఎల్ఎస్‌డీ కూడా ఓటీటీ లోకి రాబోతుంది.. ఈ సిరీస్ లో ప్రాచీ టకర్, నేహా దేశ్‌పాండే, ప్రభాకర్ , కునల్, అభిలాష్ బండారి, రమ్య దినేష్ ప్రధాన పాత్రల్లో నటించారు..

అనిల్ మోదుగ , శివ కోన సంయుక్తంగా నిర్మించారు. ఈ సిరీస్‌ను సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించారు.. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.. ట్రైలర్‌కు ఆడియన్స్‌ నుంచి మంచి స్పందన లభిస్తోంది. మూడు జంటల మధ్య జరిగే ఆసక్తికరమైన సన్నివేశాలు, ఫారెస్ట్‌ ట్రిప్‌ ఆడియన్స్‌లో ఆసక్తి పెంచేస్తున్నాయి.. ప్రస్తుతం ఈ సిరీస్ ట్రైలర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. సైకలాజికల్ థ్రిల్లర్‌లో ఆద్యంతం సస్పెన్స్‌ ఉన్నట్లుగా ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. డార్క్ కామెడీగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌ ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. ఎమ్ఎక్స్ ప్లేయర్‌లో ఈ సిరీస్‌ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది.. ఇప్పటివరకు మంచి టాక్ ను అందుకుంటున్న ఈ సిరీస్ ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి..

Exit mobile version