LPG Users Alert: ఎల్పీజీ వినియోగదారులకు షాక్.. మారిన గ్యాస్ నిబంధనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LPG Users Alert: ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం తర్వాత భారత్‌లో గ్యాస్ కొరత ఏర్పడింది.. ముఖ్యంగా హార్మూజ్ జలసంధి దగ్గర ఆంక్షలతో భారత్‌కు సరఫరా నిలిచిపోవడం.. దానికి తోడు దేశంలో అనవసర భయాందోళనల మధ్య.. ఒక్కసారిగా గ్యాస్ బుకింగ్స్ పెరిగిపోవడం.. విపరీతమైన డిమాండ్‌తో బుకింగ్ లైన్స్ పనిచేయని పరిస్థితి కూడా వచ్చింది.. ఆ తర్వాత రూల్స్ మారుస్తూ వచ్చింది కేంద్రం.. ఇక, ఎల్పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. జూన్ 1 నుంచి “ఒక ఇంటికి, ఒక గ్యాస్ కనెక్షన్” విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఎల్పీజీ సరఫరాపై ఒత్తిడి పెరగడంతో, గ్యాస్ వినియోగాన్ని క్రమబద్ధీకరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కొత్త నిబంధన ప్రకారం, ఇప్పటికే పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్ కలిగి ఉన్న వినియోగదారులు తమ ఎల్పీజీ కనెక్షన్‌ను వదులుకోవాల్సి ఉంటుంది. PNG కనెక్షన్ యాక్టివేట్ అయిన తేదీ నుంచి 30 రోజుల లోపు ఎల్పీజీ కనెక్షన్‌ను సరెండర్ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిర్ణీత గడువులోగా కనెక్షన్‌ను తిరిగి ఇవ్వకపోతే ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ వంటి సంస్థలు ఆ కనెక్షన్‌ను రద్దు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం LPG, PNG కనెక్షన్లు రెండూ కలిగి ఉన్న కుటుంబాలను గుర్తించేందుకు చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. రెండు డేటాబేస్లను పరిశీలించి ద్వంద్వ కనెక్షన్లు ఉన్న వినియోగదారులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది.
Also Read
- Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
- Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
అయితే వినియోగదారులకు ప్రభుత్వం మరో అవకాశం కూడా కల్పించింది. PNG కనెక్షన్ ప్రారంభమైన 30 రోజులలోపు LPG కనెక్షన్‌ను సరెండర్ చేయడం లేదా ట్రాన్స్ఫర్ వోచర్ పొందడం అనే రెండు ఎంపికలు అందుబాటులో ఉంటాయి. భవిష్యత్తులో PNG సదుపాయం లేని ప్రాంతానికి మారితే, ఈ ట్రాన్స్ఫర్ వోచర్ ద్వారా తిరిగి LPG కనెక్షన్‌ను పొందే అవకాశం ఉంటుంది. అయితే, అన్ని సందర్భాల్లో LPG కనెక్షన్‌ను తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. సాంకేతిక, భద్రతా లేదా మౌలిక సదుపాయాల సమస్యల కారణంగా PNG సరఫరా సాధ్యం కాదని సంబంధిత గ్యాస్ సంస్థ ధృవీకరిస్తే, ఆ కుటుంబాలు LPG వినియోగాన్ని కొనసాగించవచ్చు. అలాగే వాణిజ్య అవసరాల కోసం చట్టబద్ధంగా LPG ఉపయోగిస్తున్న వారికి కూడా ఈ నిబంధన వర్తించదు.
ఇక, PNG పైప్‌లైన్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో నివసిస్తూ, నోటీసు గడువు ముగిసిన తర్వాత కూడా PNGకు మారని వినియోగదారుల LPG సరఫరా నిలిపివేయబడే అవకాశం ఉంది. ప్రస్తుతం PNG సేవలు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో గృహ వినియోగ LPG సిలిండర్ల బుకింగ్, రీఫిల్‌లపై కూడా పరిమితులు విధించే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులు తమ ప్రాంతంలో PNG సేవల లభ్యత, కొత్త నిబంధనల వివరాలను తెలుసుకుని తగిన చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
-
Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!