LPG Rule Changes: ఎల్పీజీ నిబంధనల్లో కీలక మార్పులు.. ఉల్లంఘిస్తే గ్యాస్ కనెక్షన్ కట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LPG Rule Changes: దేశవ్యాప్తంగా ఎల్పీజీ (LPG) వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకురానుంది. జూన్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనల ప్రకారం, ఒకే కుటుంబం ఒకేసారి పీఎన్జీ (PNG) మరియు ఎల్పీజీ కనెక్షన్లను కొనసాగించడంపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ప్రభుత్వం ప్రకటించిన “ఒక కుటుంబానికి – ఒక కనెక్షన్” విధానాన్ని మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. దేశంలో పీఎన్జీ కనెక్షన్ల విస్తరణ వేగంగా జరుగుతున్నప్పటికీ, ఎల్పీజీ వినియోగంలో ఆశించిన మేర తగ్గుదల కనిపించకపోవడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. మార్చి నెల నాటికి సుమారు 6.5 లక్షల కొత్త పీఎన్జీ కనెక్షన్లు మంజూరైనప్పటికీ, వాస్తవ వినియోగం అంచనాల కంటే 18 శాతం తక్కువగా నమోదైంది. దీంతో చాలా కుటుంబాలు పీఎన్జీ కనెక్షన్ తీసుకున్నప్పటికీ ఎల్పీజీ కనెక్షన్‌ను కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది.
ఈ నేపథ్యంలో పీఎన్జీ సదుపాయం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్న కుటుంబాలు తమ ఎల్పీజీ కనెక్షన్లను స్వచ్ఛందంగా వదులుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. అయితే ఆ సూచనలను పెద్దగా పట్టించుకోకపోవడంతో ఇప్పుడు చమురు మార్కెటింగ్ సంస్థలు (OMCs) కఠిన చర్యలకు సిద్ధమవుతున్నాయి. సవరించిన నిబంధనల ప్రకారం ఒకే చిరునామాలో పీఎన్జీ మరియు ఎల్పీజీ రెండు గ్యాస్ కనెక్షన్లు కలిగి ఉండటం నిషేధంగా పరిగణించబడుతుంది. ఇప్పటికే పీఎన్జీ సౌకర్యం ఉన్న కుటుంబాలను గుర్తించే ప్రక్రియ ప్రారంభమైంది. నిర్దేశిత గడువులోగా ఎల్పీజీ కనెక్షన్‌ను నిలిపివేయని పక్షంలో, వారి గ్యాస్ సరఫరాను నిలిపివేయడం లేదా కనెక్షన్‌ను రద్దు చేసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Also Read
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
అయితే, వినియోగదారులకు కొంత వెసులుబాటు కూడా కల్పించారు. పీఎన్జీ కనెక్షన్ పొందిన 30 రోజుల్లోపు ఎల్పీజీ కనెక్షన్‌ను నిలిపివేసిన వారు భవిష్యత్తులో అవసరమైతే తమ ఎల్పీజీ కనెక్షన్‌ను తిరిగి యాక్టివేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పీఎన్జీ సౌకర్యం లేని ప్రాంతాలకు మారిన సందర్భంలో ఈ వెసులుబాటు ఉపయోగపడనుంది.
ఇక జూన్ నెల నుంచి పీఎన్జీ పైప్‌లైన్ సదుపాయం ఉన్న ప్రాంతాల్లో గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్, రీఫిల్లింగ్ ప్రక్రియలపై కూడా పరిమితులు అమలు చేయనున్నారు. నగర గ్యాస్ పంపిణీ సంస్థలు మరియు చమురు సంస్థలు తమ డిజిటల్ డేటాబేస్లను అనుసంధానం చేయడంతో ద్వంద్వ కనెక్షన్లను సులభంగా గుర్తించే అవకాశం ఏర్పడింది. పీఎన్జీ కనెక్షన్ మార్పిడికి గడువును జూన్ 30 వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. సిలిండర్ దుర్వినియోగం, నిల్వలు మరియు బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు ఎల్పీజీ రీఫిల్ లాక్-ఇన్ వ్యవధిని కూడా పెంచారు. పట్టణ ప్రాంతాల్లో ఒక సిలిండర్ రీఫిల్ తర్వాత తదుపరి బుకింగ్‌కు కనీస వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచగా, గ్రామీణ ప్రాంతాల్లో అది 45 రోజులుగా నిర్ణయించారు.
అదేవిధంగా, గృహ వినియోగదారులకు ఏడాదికి 12 సబ్సిడీ సిలిండర్లు మాత్రమే అందించనున్న నిబంధన కొనసాగనుంది. అదనంగా తీసుకునే సిలిండర్లకు మార్కెట్ ధర ప్రకారం చార్జీలు వసూలు చేస్తారు. కొత్త ఎల్పీజీ కనెక్షన్లకు డిపాజిట్, రెగ్యులేటర్, పైపు మరియు ఇన్‌స్టాలేషన్‌కు సంబంధించిన సవరించిన ఫీజులు కూడా వర్తించనున్నాయి. ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ కొత్త నిబంధనలతో ఎల్పీజీ వినియోగంలో పారదర్శకత పెరగడంతో పాటు గ్యాస్ సబ్సిడీల దుర్వినియోగాన్ని అరికట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!