LPG Gas Price: ఈరోజు నుంచి దేశంలో LPG గ్యాస్ సిలిండర్ల ధరలు మారాయి. చమురు కంపెనీలు LPG సిలిండర్ల ధరను తగ్గించిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ల ధరలో రూ.₹5 తగ్గించారు. ఈ కొత్త ధర నేటి నుంచే అమల్లోకి వచ్చింది. IOCL నివేదికల ప్రకారం.. ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ సవరించిన ధర రూ.1,590.50. ఇది గతంలో రూ.1,595.50 ఉండేది. అయితే వంట గ్యాస్ సిలిండర్ లేదా 14.2 కిలోల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు.
READ ALSO: Shambala: వణుకు పుట్టించేలా ‘శంబాల’ ట్రైలర్ విజువల్స్
మీ నగరంలో ధర ఎంత..
వాణిజ్య LPG సిలిండర్ల ధరలో అక్టోబర్‌లో చివరి మార్పు జరిగింది. అక్టోబర్‌లో 19 కిలోల సిలిండర్ ధర రూ.15 పెరిగింది. అయితే ఇప్పుడు అది రూ.5 తగ్గింది. ఈ తగ్గింపు తర్వాత నవంబర్ 1 నుంచి అమలులోకి వచ్చే వాణిజ్య LPG కొత్త ధర ముంబైలో రూ.1,542, కోల్‌కతాలో రూ.1,694, చెన్నైలో రూ.1,750 గా ఉంది. వాణిజ్య LPG సిలిండర్లను హోటళ్ళు, రెస్టారెంట్లు, ధాబాలు, ఇతర వాణిజ్య సంస్థలలో ఉపయోగిస్తారు. IOCL వెబ్‌సైట్ ప్రకారం.. ఇప్పుడు 19 కిలోల సిలిండర్ పాట్నాలో రూ.1876కి, నోయిడాలో రూ.1876కి, లక్నోలో రూ.1876కి, భోపాల్‌లో రూ.1853.5, గురుగ్రామ్‌లో రూ.1607కి అందుబాటులో ఉంటుంది.
మారని సోయాబీన్ గ్యాస్ ధరలు ..
దేశంలో వంట గ్యాస్ ధరలో ఎటువంటి మార్పు లేదు. 14.2 కిలోల LPG సిలిండర్ ధర చివరిసారిగా ఏప్రిల్ 8, 2025న సవరించారు. నాటి నుంచి వీటి ధరలలో ఎలాంటి మార్పులేదు. వాణిజ్య గ్యాస్ ధర మాత్రమే మారింది. ఢిల్లీలో ప్రస్తుత LPG ధర రూ. 853, కోల్‌కతాలో LPG ధర రూ.879, ముంబైలో రూ.852.50, చెన్నైలో రూ.868.50, లక్నోలో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.890.50, అహ్మదాబాద్‌లో రూ. 860, హైదరాబాద్‌లో రూ.905, వారణాసిలో రూ. 916.50, పాట్నాలో రూ. 951 గా ఉంది. LPG సిలిండర్లతో పాటు ATF ధరలు కూడా మారాయి. దేశీయ విమాన ఇంధనం ఢిల్లీలో కిలోకు ₹94,543.02గా ఉంది. అదేవిధంగా అంతర్జాతీయ విమాన ఇంధనం ఢిల్లీలో కిలోకు ₹817.01గా ఉంది.
READ ALSO: Casting Call: మయసభ క్రియేటర్స్ నుంచి కాస్టింగ్ కాల్..
