NTV Telugu Site icon

LPG Cylinder Price: గ్యాస్ సిలిండర్ పై రూ. 200 రాయితీ

Cyclender

Cyclender

సామాన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతుంది. వంటగ్యాస్‌ ధరలను రూ.200 వరకు తగ్గించాలని ఇప్పటికే మోడీ సర్కార్ నిర్ణయించింది. త్వరలో సిలిండర్‌పై రూ.200 తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించబోతోంది. విపక్షాలకు వంటగ్యాస్‌ ధరలు ఆయుధంగా మారాయి.. అయితే, అతి త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల జరుగబోతున్నాయి. గ్యాస్‌ ధరలు జనంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయన్న నివేదికలతో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకోబోతుంది.

Read Also: K.Raghavendra Rao: ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన దర్శకేంద్రుడు

అయితే, ఇవాళ కేంద్రం ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో 14 కేజీల వంట గ్యాస్ సిలిండర్ ధర 11 వందల రూపాయల వరకు ఉంది. మోడీ ప్రధానమంత్రి కాక ముందే ఈ గ్యాస్ సిలిండర్ ధర రూ. 450గా ఉంది. ఈ తొమ్మిదేళ్ల కాలంలో వంట గ్యాస్ మూడింతలు పెరిగింది. దీనికి తోడు నిత్యావసర సరుకుల ధరలు సైతం భారీగా పెరిగిపోయాయి. ఇది మధ్య తరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపించింది.

Read Also: MK Stalin: కేరళ ప్రజలకు ఓనం శుభాకాంక్షలు తెలిపిన MK స్టాలిన్

ఇక, వంట గ్యాస్ సిలిండర్ ధరలపై చాలా కాలం నుంచి విపక్షాలు సైతం చాలా విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం ఇవ్వకుండా.. కేంద్రమే ధరను 200 రూపాయల వరకు తగ్గించటం ద్వారా ధరలను కూడా అదుపు చేసినట్లు ఉంటుందనే ఆలోచన చేస్తున్నట్లుంది. అయితే.. తగ్గించిన వంటగ్యాస్ ధరలు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయనే.. దానిపై కేంద్ర ప్రభుత్వం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.