ప్రేమ గుడ్డిది అని అందరు అంటారు.. కొంతమంది మాత్రం మూగది అని కూడా అంటారు.. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రేమకు అవధులు లేవు అని చెప్పాలి.. కొందరు తమ ప్రియమైన వారి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు.. కొందరు తాము ప్రేమించిన వారు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు.. దానికోసం ఏదైనా చేస్తారు.. ఎంతవరకైనా వెళతారు.. తమ ప్రియమైన వారి పేరును టూటూలుగా వేయించుకోవడాన్ని కొందరు ఇష్టపడతారు. అలా ఓ యువకుడు తన ప్రేయసి కోసం ఓ టాటూ వేయించుకున్నాడు.. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో లో కుర్రాడు కూడా అలాగే చేశాడు.. అయితే ఆ కుర్రాడు తన ప్రేయసి పేరును టాటూగా వేయించుకోలేదు.. ఆమె పంటి గాట్లను టాటూగా వేయించుకున్నాడు.. ఈ వీడియోను ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు.. ఆ వీడియోలో తన ప్రియురాలు అతన్ని బాగా గట్టిగా కాట్లు పడేలా కోరుకుతుంది.. ఆ కాటును అతను టాటూలాగా వేయించుకుంటారు.. ఆ గాట్లు మీద ఆరిస్ట్ టాటూ వేశాడు. కింద ఆ టాటూ వేయించుకున్న డేట్ కూడా ముద్రించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు..
ఈ వీడియోను చూసిన కొంతమంది షాక్ అవ్వగా.. మరికొంతమంది తిడుతున్నారు.. ఇప్పటివరకు మిలియన్ల మంది వీక్షించారు. 5.6 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అయ్యారు.. ఇలాంటి దరిద్రం ఏంట్రా బాబు అంటూ ఫన్నీగా కామెంట్స్ చేశారు.. మొత్తానికి ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. ఆ దరిద్రాన్ని మీరు కూడా ఒకసారి చూసేయ్యండి..