Site icon NTV Telugu

Love Today OTT Release : లవ్ టుడే ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే

Love Today

Love Today

Love Today OTT Release : కోలీవుడ్ లో కోమలి సినిమాతో ప్రదీప్ రంగనాథన్ మంచి దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తాజాగా ఆయన హీరోగా స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం లవ్ టుడే. ఎలాంటి అంచనాలు లేకుండా తమిళనాట విడుదలై విజయం సాధించింది. దీంతో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగులోకి తీసుకొచ్చారు. నవంబర్ 25న విడుదలైన లవ్ టుడే పాజిటివ్ టాక్ తో తెలుగులోనూ దూసుకుపోతుంది. అలాగే కలెక్షన్ల పరంగా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టుతోంది. సుమారు రూ. 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం తమిళనాట రూ. 70 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది.

Read Also: Pig Hotel: నేను ఎప్పుడూ చూడలే.. పందులకోసం ఫైవ్‌ స్టార్‌ హోటలా?

ప్రేమకథకు కామెడీని జోడించి ఎంతో ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు ప్రదీప్‌ రంగనాథన్. ఈ చిత్రంలో ప్రదీప్‌కు జోడీగా ఇవానా, రవీనా రవి హీరోయిన్లుగా నటించారు. సత్యరాజ్‌, రాధికా, యోగిబాబు కీలకపాత్రలు పోషించారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం శ్రోతలను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోన్న లవ్‌టుడే సినిమా అప్పుడే ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ లవ్‌టుడే డిజిటల్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది. డిసెంబర్‌ 2న ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్‌ చేయనునుంది. త‌మిళంతో పాటు తెలుగు భాషల్లోనూ ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించి నెట్‌ఫ్లిక్స్‌ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా తెలుగులో విడుదలైన మొదటి రోజే ఈ సినిమా రూ. 2 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. శ‌నివారం కూడా కోటికిపైగా కలెక్షన్లు వచ్చినట్లు చెబుతున్నారు. ఇలా కలెక్షన్లు పెరుగుతున్న క్రమంలో ఓటీటీ రిలీజ్ డేట్‌ ఎనౌన్స్ చేయడం దిల్‌రాజుకు షాకింగ్‌ కలిగించే విషయమే.

Exit mobile version