మలయాళంలో డబ్ అవుతున్న చైతూ ‘లవ్‌స్టోరీ’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘లవ్‌స్టోరీ’ సినిమా సెప్టెంబర్ 24వ తేదీన విడుదలై ఘనవిజయం సొంతం చేసుకుంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ మూవీని వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ పతాకంపై నారాయణదాస్ నారంగ్, రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. ముఖ్యంగా ఈ మూవీకి పవన్ సీహెచ్ అందించిన సంగీతం ప్లస్ పాయింట్‌గా నిలిచింది. సారంగదరియా పాట అయితే యూట్యూబ్‌లో రికార్డులను కొల్లగొట్టింది.
హీరో చైతూ ఈ సినిమాలో తన కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తాను మంచి డ్యాన్సర్ అని ఈ మూవీతో సాయిపల్లవి మరోసారి నిరూపించింది. దీంతో విడుదలైన రోజు నుంచే మంచి టాక్‌తో ‘లవ్‌స్టోరీ’ మంచి కలెక్షన్లు సాధించింది. ఇప్పుడు ‘లవ్‌స్టోరీ’ మూవీని మలయాళంలో డబ్ చేస్తున్నారు. ‘ప్రేమతీరం’ అనే టైటిల్‌తో ఈనెల 29న అక్కడ విడుదల చేయనున్నట్లు సమాచారం. హీరోయిన్ సాయిపల్లవికి మలయాళంలో మంచి క్రేజ్ ఉంది. దీంతో ఈ మూవీ నిర్మాతలు మల్లూవుడ్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేపట్టారు. కాగా ఈ మూవీ తెలుగు వెర్షన్ ఈనెల 22 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
Also Read
- Pawan Kalyan: "రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా".. తెలంగాణపై మరోసారి స్పందన.!
- KTR: "తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా".. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
- Nellore Politics: గ్రౌండ్ వర్క్ స్టార్ట్.. రాజకీయాల్లోకి ప్రముఖ నాయకుల కూతుళ్లు, కోడళ్లు!
- IND vs NZ: కివీస్ గడ్డపై టీమిండియా సవాల్.. 2 టెస్టులు, 5 వన్డేలు, 5 టీ20లు.. న్యూజిలాండ్ టూర్ పూర్తి షెడ్యూల్ విడుదల.!
తాజావార్తలు
-
Pawan Kalyan: “రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా”.. తెలంగాణపై మరోసారి స్పందన.!
-
KTR: “తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా”.. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
-
IRUMUDI Glimpse : ఇరుముడి గ్లిమ్స్ రిలీజ్.. రవితేజకు హిట్ గ్యారంటీ
-
Power Saving Tips: ఏసీ కాదు..కూలర్ కాదు.. మీ సీలింగ్ ఫ్యాన్‌తోనే కరెంట్ బిల్లు వాచిపోద్ది..ఎలాగంటే?
-
Suriya : టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో ఐదు రూపాయల డాక్టర్ బయోపిక్‌లో సూర్య..
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!