కొన్ని ప్రేమ పెళ్లిళ్లు సక్సెస్ అవుతుండగా మరికొన్ని ప్రేమ పెళ్లిళ్లు విషాదంగా ముగుస్తున్నాయి. మనస్పర్థల కారణంగా.. కట్నం డిమాండ్ తో నవ వధువులు షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది. బక్షి కా తలాబ్ (బికెటి) పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అనురాగ్ సింగ్ భార్య సౌమ్య ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకునే ముందు, సౌమ్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక భావోద్వేగ వీడియోను పోస్ట్ చేసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read:Odisha: గ్యాస్ మెకానిక్‌గా నటిస్తూ, ప్రొఫెసర్ భార్యపై అత్యాచారయత్నం..
సమాచారం ప్రకారం, సౌమ్య, కానిస్టేబుల్ అనురాగ్ సింగ్ నాలుగు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ వివాహం జరిగిన కొన్ని రోజులకే సౌమ్య తన అత్తమామల నుంచి వేధింపులను ఎదుర్కోవలసి వచ్చింది. సౌమ్య తనతో కట్నం తీసుకురాకపోవడంతో అనురాగ్ కుటుంబం కట్నం గురించి ఇబ్బందులకు గురిచేసేవారని తెలిపారు. కుటుంబ సభ్యుల ఒత్తిడితో, అనురాగ్ ఆమెను వేరే వివాహం చేసుకోవాలని కూడా బలవంతం చేస్తున్నాడని తెలిపారు. ఇది మాత్రమే కాదు, అనురాగ్ తరచుగా సౌమ్యను కొట్టేవాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అత్తింటి వేధింపులు, భర్త కూడా వారికి సపోర్ట్ గా మారడంతో సౌమ్య మానసికంగా కుంగిపోయింది. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
