Site icon NTV Telugu

Lords Test: ఫలించని జడేజా పోరాటం.. లార్డ్స్‌లో ఇంగ్లాండ్ విజయ కేతనం..!

England Win

England Win

Lords Test: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సీరియస్ లో భాగంగా.. లీడ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ 22 పరుగులతో విజయం సాధించింది. భారత్ రెండో ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా చివరి వరకు పోరాడిన విజయం ఇంగ్లాండ్ వైపు నిలిచింది. మొదటి ఇన్నింగ్స్ లో ఇరుజట్లు 387 పరుగులకు ఆల్ అవుట్ అయ్యాయి. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 192 పరుగులకు ఆల్ అవుట్ అయింది. దాంతో 193 పరుగుల లక్ష్య చేదనకు వచ్చిన టీమిండియా మొదటి నుంచే వికెట్లు కోల్పోవడం జరిగింది.

Read Also:Lokesh Kanagaraj : రజినీకాంత్ కు చెప్పిన కథ వేరు.. తీసింది వేరు : లోకేష్

ఈ నేపథ్యంలో నాలుగు రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 58 పరుగులు చేసింది. అయితే పరుగులు ఎక్కువ లేకపోయినా టీమిండియా బ్యాటర్లు తడబడ్డారు. ఐదో రోజు ఆటో మొదలైన మొదటి సెషన్ లోనే నాలుగు కీలక వికెట్లను కోల్పోయింది. దీంతో ఇంగ్లాండ్ విజయం దాదాపు ఖరారు అయ్యింది. అయితే, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.. బూమ్రా, మహమ్మద్ సిరాజ్ లతో కలిసి లక్ష్యం వైపు పరుగులు రాబట్టాడు. అయితే, అనవసరపు షాట్ల కారణంగా బూమ్రా, మహమ్మద్ సిరాజ్ లు అవుట్ కావడంతో ఇంగ్లాండ్ 22 పరుగులతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇంగ్లాండ్ 2- 1తో సీరిస్ లో ముందంజ వేసింది.

Read Also:Dharmavaram Silk Sarees: ‘ధర్మవరం’ పట్టు చీరకు జాతీయ గుర్తింపు..

Exit mobile version