Site icon NTV Telugu

Lokesh Kanagaraj : లోకేష్ కనగరాజ్ ‘DC’ సర్ప్రైజ్.. వాలెంటైన్స్ డే నాడు అదిరిపోయే అప్‌డేట్!

Lokesh Kanagaraj 'dc' Update

Lokesh Kanagaraj 'dc' Update

లోకేష్ కనగరాజ్ అంటే మనందరికీ ‘LCU’ (Lokesh Cinematic Universe) గుర్తుకొస్తుంది. కానీ, ఈ వాలెంటైన్స్ డే నాడు ఆయన ఒక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. ఆయన నిర్మాణంలో అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘DC’ చిత్రం నుండి టైటిల్ టీజర్ వదిలారు. ఇందులో లోకేష్ ఒక స్టైలిష్ పాత్రలో కనిపిస్తున్నారు. వామిఖా గబ్బితో కలిసి ఆయన కెమెరా ముందుకు రావడం చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. కేవలం దర్శకత్వానికే పరిమితం కాకుండా, నటనలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి లోకేష్ సిద్ధమైనట్లు ఈ వీడియో స్పష్టం చేస్తోంది.

Also Read : Dhurandhar 2: గల్ఫ్ మార్కెట్‌పై కన్నేసిన ‘ధురంధర్ 2’..

ఈ చిన్న వీడియో గ్లింప్స్‌లో లోకేష్ కనగరాజ్ చాలా హ్యాండ్సమ్‌గా, కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు. గతంలో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యామియో రోల్స్ చేసినా, ఈసారి ఒక ఫుల్ లెంగ్త్ పాత్రలో లేదా కీలక పాత్రలో ఆయన నటిస్తున్నట్లు సమాచారం. అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ వీడియోకు మరింత హైప్ ఇచ్చింది..‘హ్యాపీ వాలెంటైన్స్ డే ఫ్రమ్ ది వరల్డ్ ఆఫ్ DC’ అంటూ ఆయన షేర్ చేసిన ఈ పోస్ట్, ఆయన నటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. లోకేష్ ఇకపై నటుడిగా కూడా బిజీ అయిపోతారా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

Exit mobile version