Site icon NTV Telugu

Mohammad Faizal: లక్షద్వీప్‌ ఎంపీకి భారీ ఊరట.. ఫైజల్‌పై అనర్హత ఎత్తివేత

Mohammad Faizal

Mohammad Faizal

Mohammad Faizal: ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటుకు గురైన ఎన్సీపీ నేత మహమ్మద్ ఫైజల్‌కు భారీ ఊరట లభించింది. ఆయనపై విధించిన అనర్హతను లోక్‌సభ వెనక్కి తీసుకుంది. ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాహుల్‌ గాంధీ వ్యవహారంపై దుమారం రేగుతున్న వేళ, లోక్‌సభ సెక్రటేరియట్‌ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఓ క్రిమినల్ కేసులో దోషిగా తేలిన మహమ్మద్‌ ఫైజల్‌కు కవరత్తి సెషన్స్‌ కోర్టు 10ఏళ్ల శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో ఆయన సభ్యత్వాన్ని జనవరి 13న దిగువ సభ రద్దు చేసింది. కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేరళ హైకోర్టు నుంచి జనవరి 25న సస్పెన్షన్ ఆదేశాలను తెచ్చుకున్నారు. కానీ లోక్‌సభ సచివాలయం ఆయన సభ్వత్వాన్ని పునరుద్ధరించకపోవడంతో సుప్రీంను ఆశ్రయించారు. ఈ కేసు విచారణ ఈ రోజు జరగాల్సి ఉండగా. అంతకు ముందే లోక్‌సభ సెక్రెటేరియట్ తాజా నిర్ణయం తీసుకుంది.

Read Also: Corona Cases: దేశంలో కరోనా విజృంభణ.. 5 నెలల గరిష్ఠానికి రోజువారీ కేసులు

2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేత మహ్మద్ సలేహ్‌పై దాడి చేశారన్న కేసులో మహ్మద్ ఫైజల్‌కు కవరత్తి సెషన్స్ కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఈ ఏడాది జనవరి 10న తీర్పు చెప్పింది. జనవరి 13న లోక్‌సభ సచివాలయం ఆయనపై అనర్హత వేటు వేసింది. దీంతో ఫైజల్ లోక్‌సభ సభ్యత్వం రద్దైంది. తనకు పడ్డ శిక్షను సవాల్ చేస్తూ ఫైజల్.. కేరళ హైకోర్టును ఆశ్రయించగా.. సెషన్స్ కోర్టు తీర్పును నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది ధర్మాసనం. దీంతో ఆయనపై అనర్హత చెల్లుబాటు కాకుండా పోయింది. అయితే, ఫైజల్ సభ్యత్వాన్ని లోక్‌సభ సచివాలయం పునరుద్ధరించలేదు. దీన్ని ఆయన సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు తలుపు తట్టారు.

Exit mobile version