Lok Sabha: లోక్‌సభ‌లో పాసైన యాంటీ పేపర్ లీక్ బిల్లు

  • లోక్‌సభ‌లో పాసైన యాంటీ పేపర్ లీక్ బిల్లు
  • మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం
  • 10 గంటల సుదీర్ఘ చర్చ తర్వాత ఆమోదం
Loksabha2

Loksabha2

లోక్‌సభలో పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం పొందింది. మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. పేపర్ లీక్ నిరోధక బిల్లుపై 10 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. అధికార-ప్రతిపక్ష సభ్యులు బిల్లుపై ప్రసంగించారు. అనంతరం బిల్లుపై ఓటింగ్ నిర్వహించగా మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. నీట్ పేపర్ లీక్‌పై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. దీంతో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సోమవారం పేపర్ లీక్ బిల్లును ప్రవేశపెట్టింది. దాదాపు 10 గంటల పాటు చర్చ తర్వాత మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.

వందేమాతరం బిల్లు ఆమోదం

ఇక రాజ్యసభలో వందేమాతరం బిల్లును కూడా ఆమోదించింది. అవమానిస్తే 3 సంవత్సరాలు జైలు శిక్ష పడనుంది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగా ‘వందేమాతరం’ను అవమానించినా లేదా జాతీయ గీతాలాపనను అడ్డుకున్నా, ఎవరికైనా మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధిస్తారు.