NTV Telugu Site icon

Lok Sabha First Session Live: 18వ లోక్ సభ సమావేశాలు లైవ్ అప్ డేట్స్

New Project 2024 06 24t104041.453

New Project 2024 06 24t104041.453

Lok Sabha First Session Live: 18వ లోక్‌సభ తొలి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి సమావేశంలో కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీని తర్వాత జూన్ 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుండగా, జూన్ 27న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తారు. బిజెపి నాయకుడు ఏడుసార్లు ఎంపి భర్తృహరి మహతాబ్‌ను లోక్ సభ ప్రొటెం స్పీకర్ గా నియమించడం వల్ల సెషన్‌లో లోక్‌సభలో సందడి నెలకొనే అవకాశం ఉంది. ఇది కాకుండా, ఎగ్జిట్ పోల్స్, NEET, UGC-NET పరీక్షలకు సంబంధించి కూడా రచ్చ జరిగే అవకాశం ఉంది.

తాత్కాలిక అధ్యక్షుడిగా భర్తిహరి మహతాబ్‌ను నియమించడాన్ని ప్రతిపక్షం తీవ్రంగా విమర్శించింది. ప్రభుత్వం కాంగ్రెస్ ఎంపీ కె. సురేష్ వాదనను పట్టించుకోలేదు. మహ్తాబ్ ఏడు పర్యాయాలు లోక్‌సభ సభ్యునిగా ఉన్నారని, దీంతో ఆయన ఆ పదవికి సరిపోతున్నారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు. సురేశ్ 1998, 2004 ఎన్నికల్లో ఓడిపోయారని, ఈ కారణంగా ప్రస్తుతం ఆయన వరుసగా నాలుగోసారి దిగువ సభకు ఎన్నికయ్యారని చెప్పారు. అంతకుముందు 1989, 1991, 1996, 1999లలో లోక్‌సభకు ఎన్నికయ్యారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం రాష్ట్రపతి భవన్‌లో లోక్‌సభ తాత్కాలిక స్పీకర్‌గా మహతాబ్‌తో ప్రమాణం చేయిస్తారు. దీని తర్వాత మహ్తాబ్ పార్లమెంట్ హౌస్‌కు చేరుకుని ఉదయం 11 గంటలకు లోక్‌సభ కార్యకలాపాలను ప్రారంభిస్తారు. సభ ప్రారంభం కాగానే కొద్ది క్షణాలు మౌనం పాటించారు. ఆ తర్వాత లోక్‌సభ జనరల్ సెక్రటరీ ఉత్పల్ కుమార్ సింగ్ దిగువ సభకు ఎన్నికైన సభ్యుల జాబితాను ప్రవేశపెట్టనున్నారు. దీని తర్వాత, మహతాబ్ అభ్యర్థన మేరకు, లోక్‌సభ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభ సభ్యత్వ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

The liveblog has ended.
  • 24 Jun 2024 06:23 PM (IST)

    రేపటికి లోక్‌సభ వాయిదా

    లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. రేపు ఉదయం 11 గంటలకు మళ్లీ సభ ప్రారంభం కానుంది.

  • 24 Jun 2024 05:51 PM (IST)

    స్వతంత్ర ఎంపీ మహ్మద్‌ హనీఫా ప్రమాణం

    18వ లోక్‌సభ సభ్యునిగా లడఖ్‌ నుంచి స్వతంత్ర ఎంపీ మహ్మద్‌ హనీఫా ప్రమాణ స్వీకారం చేశారు.

  • 24 Jun 2024 05:39 PM (IST)

    కాంగ్రెస్ ఎంపీ కే సురేష్ ప్రమాణం

    18వ లోక్‌సభ సభ్యునిగా కాంగ్రెస్ ఎంపీ కే సురేష్ ప్రమాణ స్వీకారం చేశారు.

  • 24 Jun 2024 05:38 PM (IST)

    కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ప్రమాణం

    కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ 18వ లోక్‌సభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు.

  • 24 Jun 2024 05:25 PM (IST)

    ఇది అందరికీ గుర్తుండిపోయే ఘట్టం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

    ఢిల్లీ : ఇది అందరికీ గుర్తుండిపోయే ఘట్టం...టీడీపీ నుంచి 16 మంది ఎంపీలు ఎన్నికయ్యారు...ఆంధ్రప్రదేశ్‌లో చారిత్రాత్మకమైన అధికారాన్ని అందుకున్నాం.. దేశానికి సేవ చేసేందుకు కృషి చేస్తామని కేంద్రమంత్రి రామ్‌మోహన్‌నాయుడు అన్నారు.

  • 24 Jun 2024 05:13 PM (IST)

    బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ప్రమాణం

    బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య 18వ లోక్‌సభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు.

     

  • 24 Jun 2024 05:13 PM (IST)

    కురుక్షేత్రను అభివృద్ధి చేస్తా:బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్

    ఢిల్లీ: దేశానికి సేవ చేసే అవకాశం మళ్లీ లభించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కురుక్షేత్ర పార్లమెంటరీ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్ అన్నారు.

     

  • 24 Jun 2024 05:10 PM (IST)

    బీజేపీ ఎంపీ బీవై రాఘవేంద్ర ప్రమాణం

    బీజేపీ ఎంపీ బీవై రాఘవేంద్ర 18వ లోక్‌సభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు.

  • 24 Jun 2024 05:09 PM (IST)

    బీజేపీ ఎంపీ బసవరాజ్ బొమ్మై ప్రమాణం

    18వ లోక్‌సభ సభ్యునిగా బీజేపీ ఎంపీ బసవరాజ్ బొమ్మై ప్రమాణ స్వీకారం చేశారు.
  • 24 Jun 2024 05:08 PM (IST)

    బీజేపీ ఎంపీ జగదీష్ షెట్టర్ ప్రమాణం

    బీజేపీ ఎంపీ జగదీష్ షెట్టర్ 18వ లోక్‌సభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు.

  • 24 Jun 2024 05:07 PM (IST)

    విపక్షాలు ఎదుగుతాయి: కంగనా రనౌత్

    ఢిల్లీ: ‘ప్రధాని చెప్పినట్లే విపక్షాలు విలువైనవిగా ఎదుగుతాయని యావత్ దేశం ఆశాభావంతో ఉంది...’ అని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ అన్నారు.

  • 24 Jun 2024 05:06 PM (IST)

    ఇది నా అదృష్టం: బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్

    ఢిల్లీ : ఈ ప్రజాస్వామ్య దేవాలయంలో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం రావడం నా అదృష్టం అని బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ అన్నారు." ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దేశం పట్ల, ప్రజల పట్ల నా బాధ్యత మరింత పెరిగిందని, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నాను. వారి ఆకాంక్షలను నెరవేర్చడం కోసం ప్రయత్నిస్తాను..." అని ఆయన అన్నారు.

  • 24 Jun 2024 05:04 PM (IST)

    నీట్‌ కేసుపై విచారణ జరుగుతోంది: కేంద్రమంత్రి చిరాగ్‌ పాశ్వాన్‌

    ఢిల్లీ: రాజ్యాంగం ఆధారంగానే దేశం నడుస్తుందని ప్రధాని మోదీ చాలాసార్లు చెప్పారని... ఈ ప్రభుత్వం ఆయన నేతృత్వంలో నడుస్తోందని కేంద్రమంత్రి చిరాగ్‌ పాశ్వాన్‌ అన్నారు. నీట్‌ కేసుపై విచారణ జరుగుతోందని, దోషులుగా తేలిన వారిపై చర్యలు తీసుకుంటామని... ప్రభుత్వం ఏమాత్రం పారిపోవడం లేదని, మనం దాచుకోవాల్సింది ఏమీ లేదని.. ఇలాంటి ఘటన జరగకుండా ప్రభుత్వం భరోసా ఇస్తోంది. భవిష్యత్తులో జరగదు." అని కేంద్ర మంత్రి వెల్లడించారు.

  • 24 Jun 2024 05:02 PM (IST)

    బీజేపీ ఎంపీ డాక్టర్ నిషికాంత్ దూబే ప్రమాణం

    18వ లోక్‌సభ సభ్యునిగా బీజేపీ ఎంపీ డాక్టర్ నిషికాంత్ దూబే ప్రమాణ స్వీకారం చేశారు.

  • 24 Jun 2024 05:01 PM (IST)

    రాజ్యాంగం ఎలా ప్రమాదంలో పడుతుందో వివరించండి: జితన్‌రామ్‌ మాంఝీ

    ఢిల్లీ: విపక్షాల ప్రకటనపై కేంద్ర మంత్రి జితన్‌రామ్‌ మాంఝీ మాట్లాడారు. నిరాధారమైన వాదనలు వినిపిస్తున్నాయని.. రాజ్యాంగం ఎలా ప్రమాదంలో పడుతుందో వివరించాలన్నారు. తమకు మెజారిటీ ఉందని, మెజారిటీ ప్రభుత్వం నడుస్తోందన్నారు కేంద్ర మంత్రి. నీట్ అంశంపై ఆయన మాట్లాడుతూ.. ‘‘భారతదేశంలో న్యాయవ్యవస్థ అత్యున్నతమైనది.. ఒక అంశం కోర్టు పరిధిలో ఉన్నప్పుడు దానిపై జోక్యం చేసుకునే హక్కు లేదా మాట్లాడే హక్కు ఎవరికీ లేదన్నారు.

     

  • 24 Jun 2024 04:59 PM (IST)

    బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ప్రమాణం

    18వ లోక్‌సభ సభ్యునిగా బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేశారు.

     

  • 24 Jun 2024 04:58 PM (IST)

    బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ప్రమాణం

    బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ 18వ లోక్‌సభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు.

  • 24 Jun 2024 04:57 PM (IST)

    కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ సింగ్ హుడా ప్రమాణం

    18వ లోక్‌సభ సభ్యునిగా కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ సింగ్ హుడా ప్రమాణ స్వీకారం చేశారు.

  • 24 Jun 2024 04:56 PM (IST)

    ఈసారి బలమైన ప్రతిపక్షం ఉంది: బీజేపీ ఎంపీ రవికిషన్

    ఈసారి బలమైన ప్రతిపక్షం ఉందని.. దేశానికి అనుకూలంగా బిల్లులు వచ్చినప్పుడు వాటిని ఆమోదించడంలో అడ్డంకులు సృష్టించరని ఆశిస్తున్నామని బీజేపీ ఎంపీ రవికిషన్ అన్నారు. ప్రధాని మోదీ ఐదేళ్ల పదవీకాలాన్ని అద్భుతంగా పూర్తి చేస్తారన్నారు. బిల్లులు చించివేయడం, హూంకరించడం, కాగితాలు విసిరేయడం లాంటి దుశ్చర్యలు చేయకూడదని, పార్లమెంట్‌ను క్రమశిక్షణతో గౌరవించాలని కోరారు. సభను నడపడానికి అనుమతించాలి, అడ్డంకిగా మారకూడదన్నారు. ప్రధాని మోడీ ఎల్లప్పుడూ రాజ్యాంగాన్ని గౌరవిస్తారన్నారు.

  • 24 Jun 2024 04:53 PM (IST)

    ఉద్వేగానికి లోనయ్యా: ఎంపీ ఇక్రా హసన్

    ఢిల్లీ: "నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను, అలాగే ఉద్వేగానికి లోనయ్యాను. నా ప్రజలకు ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నాను..." అని సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ఇక్రా హసన్ అన్నారు.

  • 24 Jun 2024 03:36 PM (IST)

    స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవి కోసం పోటీ చేస్తాం: ఎంపీ ఎన్‌కే ప్రేమచంద్రన్

    లోక్‌సభ స్పీకర్‌ పదవితో పాటు డిప్యూటీ స్పీకర్ పదవికి పోటీ చేస్తామని రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఎంపీ ఎన్‌కే ప్రేమచంద్రన్ తెలిపారు. ఏకాభిప్రాయం కోసం ప్రతిపక్ష పార్టీలతో చర్చించబోతున్నారా లేదా అనే దానిపై ప్రభుత్వం వారి అభిప్రాయాన్ని వెలువరించనివ్వాలని పేర్కొన్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవుల గురించి అప్పుడు ఆలోచిస్తామన్నారు. కానీ కచ్చితంగా పోటీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఎమర్జెన్సీపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. గత 10 ఏళ్ల బీజేపీ ప్రభుత్వంలో రాజ్యాంగాన్ని, రాజ్యాంగ సంస్థలను స్వాధీనం చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు. రాజ్యాంగ స్వయంప్రతిపత్తి గల సంస్థల స్వాతంత్య్రం హరించుకుపోతోందన్నారు. రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రభుత్వం వైపు నుంచి బలమైన ఎత్తుగడ...కాబట్టి, రాజ్యాంగాన్ని రక్షించడానికి ప్రతిపక్షాలు ప్రతీకాత్మకంగా రాజ్యాంగాన్ని ఉంచాయన్నారు. మేము రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడాన్ని ఎప్పటికీ అనుమతించబోమని చెప్పారు. భారత సెక్యులర్ ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, సూత్రాలు, విలువలు రక్షించబడాలన్నారు.

  • 24 Jun 2024 03:27 PM (IST)

    ఎంపీగా గౌరవ్ గొగోయ్ ప్రమాణం

    కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ 18వ లోక్‌సభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు.

     

  • 24 Jun 2024 03:25 PM (IST)

    అణగారిన వర్గాల వారి కోసం గొంతుకలా పని చేస్తా: ఎంపీ చంద్రశేఖర్‌ ఆజాద్‌

    ఢిల్లీ: ఆజాద్‌ సమాజ్‌ పార్టీ (కాన్షీరామ్‌) ఎంపీ చంద్రశేఖర్‌ ఆజాద్‌ మాట్లాడుతూ.. 'నేను అణగారిన వర్గాల గొంతుకను.. వారి గొంతులను అణచివేశారు.. నేను ఢిల్లీలో ఉన్నంత కాలం వారి కోసం చేస్తానని హామీ ఇస్తున్నాను. ప్రజల కోసం నేను నా గొంతును లేపుతాను.' అని అన్నారు.

  • 24 Jun 2024 02:20 PM (IST)

    మాకు నీట్ వద్దు : డీఎంకే ఎంపీ కనిమొళి

    నీట్ వివాదంపై డీఎంకే ఎంపీ కనిమొళి మాట్లాడుతూ.. మాకు నీట్ వద్దు అని తమిళనాడు ఎప్పటినుంచో చెబుతోందని అన్నారు. దీని నుంచి బయటపడాలనుకుంటున్నాం. ఈ పరీక్ష నిజంగా నిష్పక్షపాతం కాదని ఈ రోజు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇది మాకు వద్దు అని తమిళనాడు ఎప్పటినుంచో చెబుతోందని, ఇప్పుడు దేశం మొత్తం ఇదే అంటున్నదని అన్నారు.

  • 24 Jun 2024 01:19 PM (IST)

    మధ్యాహ్నం 2 గంటల వరకు సభ వాయిదా

    లోక్‌సభ సోమవారం మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది.

  • 24 Jun 2024 12:50 PM (IST)

    కేంద్ర మంత్రి సురేష్ గోపి ప్రమాణం

    18వ లోక్‌సభ సభ్యునిగా కేంద్ర మంత్రి సురేష్ గోపీ ప్రమాణ స్వీకారం చేశారు.

  • 24 Jun 2024 12:28 PM (IST)

    ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రులు

    హెచ్‌డి కుమారస్వామి
    పీయూష్ గోయల్
    జితన్ రామ్ మాంఝీ
    ధర్మేంద్ర ప్రధాన్
    రాజీవ్ రంజన్ (లాలన్) సింగ్
    సర్బానంద సోనోవాల్
    రామ్ మోహన్ నాయుడు
    ప్రహ్లాద్ జోషి
    గిరిరాజ్ సింగ్
    జ్యోతిరాదిత్య సింధియా
    భూపేంద్ర యాదవ్
    గజేంద్ర సింగ్ షెకావత్
    అన్నపూర్ణా దేవి
    కిరణ్ రిజిజు
    మన్సుఖ్ మాండవియా
    జి కిషన్ రెడ్డి
    చిరాగ్ పాశ్వాన్
    సి.ఆర్. పాటిల్
    రావ్ ఇంద్రజీత్ సింగ్
    జితేంద్ర సింగ్
    అర్జున్ రామ్ మేఘవాల్

  • 24 Jun 2024 12:25 PM (IST)

    రాహుల్ గాంధీ రాజీనామా ఆమోదం

    సోమవారం 18వ లోక్‌సభ తొలి సెషన్‌ ప్రారంభం సందర్భంగా ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌ రాహుల్‌ గాంధీ కేరళలోని వాయనాడ్‌ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేసినట్లు సమాచారం. ఆయన రాజీనామా ఆమోదం పొందింది.

  • 24 Jun 2024 12:23 PM (IST)

    కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కి చేదు అనుభవం

    కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎంపీగా ప్రమాణం చేసేందుకు పోడియం వద్దకు వెళ్లి ప్రమాణం చేసొచ్చే వరకూ విపక్ష సభ్యులు 'నీట్.. నీట్' అని అరిచారు.

  • 24 Jun 2024 12:15 PM (IST)

    నీట్ దేశానికి సంబంధించిన ముఖ్య సమస్య

    నీట్ అంశం దేశానికి సంబంధించిన ముఖ్యమైన సమస్య అని జేఎంఎం (జార్ఖండ్ ముక్తి మోర్చా) ఎంపీ మహువా మాఝీ అన్నారు. మధ్యతరగతి ప్రజలు ఖరీదైన ప్రైవేట్ మెడికల్ కాలేజీలను కొనలేకపోతున్నారు. అందుకే ప్రభుత్వ కళాశాలలకు సిద్ధమవుతున్నారు. ఇక, ప్రభుత్వ పరీక్షల్లో పెద్ద మోసాలు జరుగుతున్నాయి. వారు (కేంద్ర ప్రభుత్వం) కూడా UGC NET పరీక్షను రద్దు చేశారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించదు. అక్రమాలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఇది విద్యాశాఖ వైఫల్యం.

  • 24 Jun 2024 11:57 AM (IST)

    భూపేంద్ర యాదవ్, గజేంద్ర సింగ్ షెకావత్

    18వ లోక్‌సభ సభ్యులుగా కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, గజేంద్ర సింగ్ షెకావత్ ప్రమాణ స్వీకారం చేశారు.

  • 24 Jun 2024 11:56 AM (IST)

    ప్రమాణం చేసిన కిషన్‌రెడ్డి, చిరాగ్‌ పాశ్వాన్‌

    18వ లోక్‌సభ సభ్యులుగా కేంద్ర మంత్రులు జి కిషన్‌రెడ్డి, చిరాగ్‌ పాశ్వాన్‌ ప్రమాణ స్వీకారం చేశారు.

  • 24 Jun 2024 11:41 AM (IST)

    జితన్ రామ్ మాంఝీ, రాజీవ్ రంజన్ (లాలన్) సింగ్ ప్రమాణ స్వీకారం

    18వ లోక్‌సభ సభ్యులుగా కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ, కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ (లలన్) సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు.

  • 24 Jun 2024 11:39 AM (IST)

    ప్రమాణం చేసిన సీనియర్ నేతలు

    బీజేపీ నేతలు రాధామోహన్ సింగ్, ఫగ్గన్ సింగ్ కులస్తే, అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్ 18వ లోక్‌సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

  • 24 Jun 2024 11:37 AM (IST)

    అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది : మల్లికార్జున్ ఖర్గే

    పార్లమెంట్ సమావేశాల మధ్య కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందన్నారు.

  • 24 Jun 2024 11:36 AM (IST)

    కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకారం

    కొత్తగా ఎన్నికైన ఎంపీలతో బీజేపీ ఎంపీ, ప్రొటెం స్పీకర్ భర్తిహరి మహతాబ్ ప్రమాణం చేయిస్తున్నారు.

  • 24 Jun 2024 11:36 AM (IST)

    రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రమాణ స్వీకారం

    బీజేపీ ఎంపీ, ప్రొటెం స్పీకర్ భర్తిహరి మహతాబ్ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ప్రమాణం చేయించారు.

  • 24 Jun 2024 11:34 AM (IST)

    రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న ప్రభుత్వం : టీఎంసీ

    నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుందని పార్లమెంట్‌ సమావేశాల మధ్య ప్రాంగణంలోనే కవాతు చేస్తున్న టీఎంసీ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ అన్నారు.

  • 24 Jun 2024 11:32 AM (IST)

    దేశ ప్రజలకు నినాదాలు అవసరం లేదు

    దేశ ప్రజలు మూడోసారి మనకు అవకాశం ఇచ్చారని ప్రధాని మోడీ అన్నారు. మా బాధ్యత మూడు రెట్లు పెరిగింది. కాబట్టి, మన మూడో టర్మ్‌లో మనం మూడు రెట్లు కష్టపడి మూడు రెట్లు ఫలితాలను సాధిస్తామని దేశప్రజలకు నేను హామీ ఇస్తున్నాను. దేశ ప్రజలకు నాటకాలు, అల్లర్లు అక్కర్లేదు. దేశానికి కావాల్సింది నినాదాలు కాదు. దేశానికి బాధ్యతాయుతమైన ప్రతిపక్షం కావాలి.

  • 24 Jun 2024 11:31 AM (IST)

    ఎంపీగా మోడీ ప్రమాణం

    18వ లోక్‌సభకు సభాపక్ష నేతగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ప్రొటెం స్పీకర్ భర్తిహరి మహతాబ్ ప్రమాణం చేయిస్తున్నారు. కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకారం మధ్య పార్లమెంట్ వెలుపల ఇండియా బ్లాక్ నిరసన వ్యక్తం చేసింది.

  • 24 Jun 2024 10:58 AM (IST)

    పదేళ్లలో ఒక సంప్రదాయం అమలు చేస్తున్నాం : మోడీ

    గత 10 సంవత్సరాలలో ఒక సంప్రదాయాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాము, ఎందుకంటే ప్రభుత్వాన్ని నడపడానికి మెజారిటీ అవసరమని భావిస్తున్నాము. అయితే దేశాన్ని నడపడానికి ఏకాభిప్రాయం చాలా ముఖ్యం. కావున, అందరి సమ్మతితో 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు, ఆశయాలను నెరవేర్చేందుకు, రాజ్యాంగ పవిత్రతను కాపాడుతూ, భారతమాతకు సేవ చేసేందుకు ఇది నిరంతరం ప్రయత్నిస్తాం. ఇక మీదట కూడా నిర్ణయాలను వేగవంతం చేయాలనుకుంటున్నాం

  • 24 Jun 2024 10:45 AM (IST)

    జూన్ 25 ప్రజాస్వామ్యానికి నల్లని మచ్చ

    జూన్ 25న భారత ప్రజాస్వామ్యానికి నల్ల మచ్చ ఏర్పడిందని ప్రధాని మోడీ అన్నారు. ఎమర్జెన్సీకి 50 ఏళ్లు. ఇండియాలో ఇంకెప్పుడూ ఇలాంటి సాహసం ఎవరూ చేయరన్నారు. అందరినీ వెంట తీసుకెళ్లాలని ప్రధాని మోడీ అన్నారు. అందరినీ వెంట తీసుకెళ్లి రాజ్యాంగంలోని హద్దులను పాటించాలన్నారు. ఈసారి యువ ఎంపీల సంఖ్య బాగానే ఉందన్నారు.

  • 24 Jun 2024 10:42 AM (IST)

    ఈరోజు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి అద్భుతమైన రోజు

    పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఇదొక అద్భుతమైన రోజు అని ప్రధాని మోడీ అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా మన సొంత పార్లమెంట్ భవనంలో ప్రమాణస్వీకారోత్సవం జరుగుతోంది. పాత పార్లమెంటు భవనంలో ఇది జరిగేది. ఈ ముఖ్యమైన రోజున కొత్తగా ఎన్నికైన ఎంపీలందరికీ నేను హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను, వారికి నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

  • 24 Jun 2024 10:36 AM (IST)

    నేడు కొత్త ఎంపీలు మాత్రమే ప్రమాణం చేస్తారు

    18వ లోక్‌సభ తొలి సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై 3 వరకు జరిగే సమావేశాల్లో తొలి రెండు రోజుల్లో కొత్త ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త లోక్‌సభ స్పీకర్ ఎన్నిక బుధవారం జరగనుండగా, గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తారు. ప్రొటెం ప్రెసిడెంట్‌ నియామకంతో పాటు నీట్‌-యూజీ పేపర్‌ లీక్‌, ఇతర పోటీ పరీక్షల వాయిదా విషయంలోనూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు వ్యూహం పన్నాయి.దీని కారణంగా తొలిరోజే దుమారం రేగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • 24 Jun 2024 10:35 AM (IST)

    I.N.D.I.A ఎంపీల కవాతు

    18వ లోక్‌సభ తొలి సెషన్‌లో మొదటి రోజు, ప్రతిపక్ష కూటమి 'ఇండియా'కు చెందిన లోక్‌సభ ఎంపీలు సోమవారం ఉదయం పార్లమెంటు కాంప్లెక్స్‌లో సమావేశమై సభ వైపు కవాతు చేస్తారు.

  • 24 Jun 2024 10:34 AM (IST)

    ఎంపీలందరికీ స్వాగతం : మోడీ

    కాసేపట్లో లోక్ సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మోడీ ఎంపీలందరకీ స్వాగతం పలుకుతున్నట్లు చెప్పారు. కొత్త లక్ష్యాలు చేరుకోవడానికి మనమంతా కృషిచేయాలని పిలుపునిచ్చారు

  • 24 Jun 2024 10:30 AM (IST)

    కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీల సమావేశం

    లోక్ సభ సమావేశానికి ముందు కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు తమ తమ లోక్‌సభ ఎంపీల సమావేశానికి పిలుపునిచ్చాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వాన్ని కార్నర్ చేసేలా వ్యూహరచన చేయవచ్చు.

  • 24 Jun 2024 10:29 AM (IST)

    జేపీ నడ్డా ఇంట్లో సమావేశం

    పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఇంట్లో సమావేశం జరుగుతోంది.

  • 24 Jun 2024 10:29 AM (IST)

    ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్ ప్రమాణం

    భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు, ఏడుసార్లు ఎంపి అయిన భర్తిహరి మహతాబ్ సోమవారం (జూన్ 24, 2024) ప్రొటెం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

  • 24 Jun 2024 09:54 AM (IST)

    లోక్‌సభ సంప్రదాయాన్ని మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కింది

    లోక్‌సభ సంప్రదాయాన్ని మోడీ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని కాంగ్రెస్ ఎంపీ కె.సురేష్ ఆరోపించారు. లోక్ సభ సంప్రదాయాన్ని ఎన్డీయే ప్రభుత్వం ఉల్లంఘించిందని అన్నారు. అత్యధిక సార్లు ఎన్నికైన ఎంపీ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించడం ఇప్పటి వరకు సంప్రదాయం. భర్తృహరి మహతాబ్‌ 7వ సారి ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే 8వ సారి ఎంపీగా ఎన్నికయ్యాను. మళ్లీ ప్రతిపక్షాలను అవమానిస్తున్నారు. అందుకే ప్యానెల్ సభ్యులను బహిష్కరించాలని ఇండియా అలయన్స్ ఏకగ్రీవంగా నిర్ణయించింది.