సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ.. ప్రధాని మోడీకి సవాల్ విసిరారు. ప్రధాని మోడీ అంగీకరిస్తే.. బహిరంగ చర్చకు సిద్ధమని తెలిపారు. బహిరంగ చర్చకు రావాల్సిందిగా ఇద్దరు మాజీ న్యాయమూర్తులు మదన్ లోకూర్, ఏపీ షా, సీనియర్ జర్నలిస్టు ఎన్ రామ్ ఆహ్వానం పలికారు. ఈ లేఖపై రాహుల్ స్పందిస్తూ ప్రధానమంత్రి మోడీ అంగీకరిస్తే చర్చకు సిద్ధమని ప్రకటించారు. చర్చలో తాను లేదా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పాల్గొనేందుకు రెడీగా ఉన్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Kannappa: ‘కన్నప్ప’లో ట్విస్ట్.. పాత్ర మార్చుకున్న ప్రభాస్?
లోక్‌సభ ఎన్నికలపై బహిరంగ చర్చలో ప్రధాని నరేంద్ర మోడీని ఎదుర్కోవడానికి తాను 100% సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అటువంటి కార్యక్రమంలో భాగంగా తాను లేదా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చర్చలో పాల్గొనడానికి ఇష్టపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. రాహుల్, ప్రధాని మోడీ అంగీకరించినట్లయితే తమకు తెలియజేయాలని మాజీ న్యాయమూర్తులు కోరారు.
ఇది కూడా చదవండి: KKR vs MI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై..
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ లోకూర్, ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అజిత్ ప్రకాశ్ షా, సీనియర్ జర్నలిస్టు, ది హిందూ మాజీ ఎడిటర్ ఎన్ రామ్ గురువారం ప్రధాని మోడీ, రాహుల్ గాంధీలకు తమ మధ్య బహిరంగ చర్చను ప్రతిపాదిస్తూ లేఖ రాశారు. లోక్‌సభ ఎన్నికలు, ఇరుపక్షాల మేనిఫెస్టోలు, కీలక అంశాలపై పరస్పరం ముఖ్యమైన ప్రశ్నలపై చర్చకు రావాలని లేఖలో తెలిపారు. ఇందులో ఎలాంటి పక్షపాతం లేదని చెప్పారు.
రాహుల్ గాంధీ చర్చకు సిద్ధమని ప్రకటించారు. ఇక ప్రధాని మోడీ స్పందిస్తారో లేదో చూడాలి. అగ్రరాజ్యాల్లో ఇలాంటి బహిరంగ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. అలాంటి ఒరవడికే మాజీ న్యాయమూర్తులు శ్రీకారం చుట్టారు.
ఇది కూడా చదవండి: Account Minimum Balance: ఇకపై మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేదు.. ఆర్బీఐ..
