NTV Telugu Site icon

Pawan singh: భోజ్‌పురి నటుడు, సింగర్ పవన్ సింగ్‌పై బీజేపీ వేటు

Pawan Sing

Pawan Sing

భోజ్‌పురి నటుడు, గాయకుడు పవన్ సింగ్‌పై బుధవారం బీజేపీ సస్పెండ్ వేటు వేసింది. బీహార్‌లో ఎన్డీయే అభ్యర్థికి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినందుకు కమలం పార్టీ సస్పెండ్ చేసింది. పవన్ సింగ్ బీహార్‌లోని కరకత్ స్థానం నుంచి ఎన్డీఏ అభ్యర్థిపై పోటీ చేస్తున్నారు. విత్‌డ్రా చేసుకునేలా బుజ్జగించినా వినకపోవడంతో తాజాగా బీజేపీ అధిష్టానం వేటు వేసింది. ఇదిలా ఉంటే గతంలో పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్‌ టిక్కెట్‌ను తిరస్కరించింది. దీంతో పవన్ సింగ్ బీహార్‌లోని కరకత్ నుంచి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగారు.

ఇది కూడా చదవండి: Bharatheeyudu 2 : ‘భారతీయుడు 2’ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. గూస్ బంప్స్ గ్యారెంటీ..

ఎన్డీఏ అభ్యర్థికి వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నందుకు వేటు వేసినట్లు బీహార్ బీజేపీ తెలిపింది. ఈ చర్య పార్టీకి వ్యతిరేకం మరియు పార్టీ ప్రతిష్టను దిగజార్చిందని తెలిపింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు వేటు వేసినట్లు బీహార్ బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి ఒక ప్రకటనలో తెలిపారు.

ఇది కూడా చదవండి: Thandel : నాగచైతన్య “తండేల్” న్యూ లుక్ వైరల్..

పవన్ సింగ్‌తో పాటు ఆయన తల్లి ప్రతిమా సింగ్ కూడా అదే స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో చివరి దశలో జూన్ 1న కరకట్ నియోజకవర్గం పోలింగ్ జరగనుంది. ఇదిలా ఉంటే తన తల్లికి, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకునేందుకే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు పవన్‌సింగ్ తెలిపారు.

ఇది కూడా చదవండి: Anand Mahindra: అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఇండోర్ అందుకే కాబోలు.. యుఎస్ వ్లాగర్.. ఆనంద్ మహీంద్రా స్పందన..