Site icon NTV Telugu

Live Mobile Robbery: కెమెరా ముందు మహిళా రిపోర్టర్‌.. వెనకనుండి మోటార్‌సైకిల్ పై వచ్చి దొంగ దాడి! వైరల్ వీడియో

Viral

Viral

Live Mobile Robbery: ఈ మధ్య కాలంలో దొంగలు బాగా రెచ్చిపోతున్నారు. ఎన్ని సెక్యూర్టీ చర్యలు చేపడుతున్న వాటికీ బెదరకుండా దొంగలు తెగ బడుతున్నారు. ముఖ్యంగా ప్రయాణాలు, రోడ్లపై ఇలాంటి దొంగతనాలు ఎక్కువయ్యాయి. ఇకపోతే తాజాగా బ్రెజిల్‌లో ఓ టీవీ రిపోర్టర్‌ లైవ్ బ్రాడ్‌కాస్ట్‌కు సిద్దమవుతున్న కేవలం కొన్ని క్షణాల ముందు దొంగ దాడి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ సంఘటన రియో డి జనీరో వీధుల్లో చోటుచేసుకోగా, అది కెమెరాలో స్పష్టంగా రికార్డైంది.

Manoj Manchu : ‘డేవిడ్ రెడ్డి’గా మంచు మనోజ్.. టైటిల్ పోస్టర్ సూపర్

క్లారా నెరీ అనే జర్నలిస్ట్‌ బ్రెజిల్‌లోని ‘బ్యాండ్ రియో’ అనే న్యూస్ నెట్‌వర్క్‌కి రిపోర్టర్‌గా పని చేస్తోంది. ఆమె వీధిలో లైవ్ రిపోర్ట్‌కి సిద్ధమవుతుండగా.. ఆమె వెనకాల నుంచి ఓ వ్యక్తి మోటార్‌సైకిల్‌పై వచ్చి ఆమె చేతిలో ఉన్న ఫోన్‌ను లాక్కొనే ప్రయత్నం చేశాడు. ఈ దృశ్యం మొత్తం కెమెరాలో రికార్డ్ అయింది. కాకపోతే దొంగ ప్రయత్నం విఫలమైన వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే అదృష్టవశాత్తూ ఆ దొంగకు ఫోన్‌ చిక్కకుండా కింద పడిపోయింది. దీనితో క్లారా తన మొబైల్‌ను తిరిగి పొందగలిగింది.

Pulivendula Politics: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో హై టెన్షన్..

ఈ ఘటన తర్వాత క్లారా నెరీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను షేర్ చేస్తూ.. లైవ్ వెళ్లే ముందు ఇళ్ల జరగడం నిజంగా చాలా భయంకరమైన అనుభవం. అయితే, చివరికి నేను క్షేమంగా ఉండటం గొప్ప విషయం అని రాసుకొచ్చింది. అలాగే ఆమెకు మద్దతుగా నిలిచిన సహచరులు, మిలటరీ పోలీసులు, సివిల్ పోలీసులు కు కృతజ్ఞతలు తెలిపారు. దొంగ మోటార్‌సైకిల్‌ మీద ఉన్న నంబర్ ప్లేట్‌ను కార్డుబోర్డ్‌తో కప్పడం ద్వారా తనను గుర్తించకుండా ప్రయత్నించాడు. ఈ విషయాన్ని క్లారా పోలీసులకు తెలియజేశారు. ప్రస్తుతం మిలటరీ, సివిల్ పోలీసు శాఖలు కేసును దర్యాప్తు చేస్తున్నాయి. ఇక వీడియో పై నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version