Site icon NTV Telugu

Viral : పిల్లిని ఓ ఆట ఆడుకున్న ఎలుక

Cat Rat

Cat Rat

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏ వీడియో పెట్టిన అది తెగ వైరల్ అవుతుంది. హైట్, పర్సనాలిటీ అస్సలు మ్యాటరే కాదు. మనలో దమ్ము ఎంతుందనేదే అస్సలు విషయం. ఈ విషయంలో అనేక అంశాల్లో, అనేక సందర్భాల్లో నిరూపితమైంది. శారీరక బలవంతులు.. తమ కంటే బలహీనులను చులకనగా చూస్తారు. వారినీ నిత్యం వేధించేందుకు ప్రయత్నం చేస్తుంటారు. అయితే, బుద్ది బలం కలిగిన వారు, ధైర్యవంతులు.. తమ శక్తియుక్తులతో బలవంతులను సైతం మట్టి కరిపిస్తారు. తాజాగా ఇదే విషయాన్ని ఓ చిట్టి ఎలుక నిరూపించింది. సాధారణంగానే పిల్లి, ఎలుక మధ్య జాతి వైరుధ్యం ఉంటుంది. ఎలుక కనిపిస్తే చాలు.. గుటుక్కున మింగేయాలని పిల్లి చూస్తుంది.

https://twitter.com/Figensport/status/1654093263488294917

Also Read : Ramabanam 1st Day Collection : గోపీచంద్ ‘రామబాణం’తో ఫస్ట్ డే ఎన్ని కోట్లు కొల్లగొట్టాడంటే ?

అందుకే, పిల్లి కనిపిస్తే చాలు.. ఎలుక హడలిపోతుంది. కానీ, తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ చిట్టి ఎలుక తనను తినడానికి వచ్చిన పిల్లిని భయపెట్టింది. వెంటబడి తరుముతూ పరుగులు పెట్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ వైరల్ వీడియోలో ఓ ఎలుక గోడ వెంట పరుగులు పెడుతుంది. అది గమనించిన పిల్లి.. ఎలుకను తినాలని ట్రై చేస్తుంది. అయితే, అత్యంత ధైర్యం కలిగిన ఆ చిట్టి ఎలుక.. తిరిగి పిల్లినే భయపెట్టింది. చెంగు చెంగున మీదకు ఎగురుతూ, పిల్లిని భయపెట్టేసింది. ఈ వీడియోను చూసి నెటజిన్లు షాక్ అవుతున్నారు. పిల్లిని ఎలుక భయపెట్టడం ఏంట్రా బాబు అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : MP Margani Bharat: చంద్రబాబు సవాల్‌.. వాలంటీర్‌ వ్యవస్థ రద్దుపై బహిరంగంగా చెప్పగలవా..?

Exit mobile version