Site icon NTV Telugu

Little Miss Naina : ఓటీటీలోకి మ్యూజికల్ రొమాంటిక్ ఫిలిం.. ఎందులో చూడాలంటే..?

Whatsapp Image 2024 01 25 At 1.17.48 Pm

Whatsapp Image 2024 01 25 At 1.17.48 Pm

తమిళ మూవీ ‘96’ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆ సినిమాలో స్కూల్ అమ్మాయిగా కనిపించిన గౌరీ కిషన్ తన నటనతో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.96 మూవీ తెలుగులో ‘జాను’ అనే టైటిల్ తో రీమేక్ చేయడం జరిగింది.. ఈ మూవీలో కూడా గౌరీ కిషన్ స్కూల్ అమ్మాయిగా ఎంతగానో ఆకట్టుకుంది.ప్రస్తుతం గౌరీ కిషన్ పలు సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆమె తాజాగా చేసిన మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ లిటిల్ మిస్ నైనా..మలయాళంలో ‘లిటిల్ మిస్ రాథర్’ గా ఆకట్టుకున్న ఈ మూవీ తెలుగులో ‘లిటిల్ మిస్ నైనా’ గా నేరుగా ఈటీవీ విన్‌లోకి వచ్చింది. జనవరి 25 నుంచి ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఈటీవీ విన్‌లో ప్రసారం అవుతుంది.ఇందులో షేర్షా షెరీఫ్ మెయిన్ లీడ్‌గా నటించారు. నూతన దర్శకుడు విష్ణు దేవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రత్యేకమైన కథాంశంతో తెరకెక్కింది..

నైనా పొట్టిగా (4 అడుగులు), అభిజిత్ పొడవుగా (6 అడుగులు) ఉండటంతో పొట్టి, పొడుగు కాన్సెప్ట్‌తో అందరినీ నవ్వించేలా ఉండబోతోంది.మధ్య తరగతి కుటుంబలో జన్మించిన నైనా, ఓసీడీ సమస్యతో బాధపడుతుంది. ఆమెకు కాలేజీలో అభిజిత్ పరిచయం అవుతాడు. అతడితో ఆమె ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత ఆమెను విడిచి తను సినిమాల్లో బిజీ అవుతాడు. అప్పుడే నైనా వేరొకరితో పెళ్లికి రెడీ అవుతుందని తెలుస్తుంది. బాధను తట్టుకోలేక, మద్యానికి బానిస అవుతాడు. పెళ్లి చేసుకోబోయే షఫీక్ మంచి వాడు కాదని నైనాకు తెలుస్తోంది. అప్పుడు మళ్లీ అభిజిత్ ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. అభిజిత్ తో కలిసి పారిపోవాలని నిర్ణయించుకుంటుంది. ఆ తర్వాత వీరిద్దరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? చివరకు ఏమైంది? అనేవి సినిమాలో చూపించారు. ఈ మూవీలో గౌరీ జి కిషన్, షేర్షా షరీఫ్ నటన ప్రేక్షకులను అద్భుతంగా అలరించింది.

Exit mobile version