Viral Video: ఓ చిన్నారి తాను చదువుతోన్న ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సౌకర్యాల లేమిని ఏకంగా ప్రధాని మోదీకి తెలియజేయాలనుకుంది. తాను చదువుతున్న స్కూల్లో మౌలిక వసతులు సరిగా లేకపోవడంతో ఆవేదన చెందిన చిన్నారి.. ‘మా స్కూల్ ఎంత చెత్తగా ఉందో చూడండి’ అని చూపిస్తూ వీడియోలో ప్రధాని మోదీ సాయం కోరింది. స్కూల్‌లో మౌలిక సౌకర్యాలపై ఏకరువు పెడుతూ ప్రధాని నరేంద్ర మోదీని అభ్యర్థిస్తోన్న వీడియో ప్రస్తుతంనెట్టింట వైరల్ అవుతోంది. తమ పాఠశాల దుస్థితిని వీడియోలో వివరిస్తూ.. మా కోసం మంచి భవనం కట్టించాలని ప్రధానిని బాలిక కోరింది. అంతేకాదు, దేశం మొత్తం చెప్పింది వినాలని, నా మొర కూడా ఆలకించాలని ఆ పసిపాప విజ్ఞప్తి చేసింది. జమ్మూ కశ్మీర్‌లోని కథువా జిల్లా లొహయ్-మల్హర్ గ్రామానికి చెందిన సీరత్ నాజ్ వీడియోను స్థానిక మీడియా తన ఫేస్‌బుక్‌లో షేర్ చేయగా.. 2 మిలియన్లకుపైగా వ్యూస్, దాదాపు 1.20 లక్షల లైక్‌లు వచ్చాయి.
జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లా లొహై-మల్హార్ గ్రామానికి చెందిన సీరత్ నాజ్ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకుంటోంది. అయితే ఆ స్కూల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఆవేదన చెందిన సీరత్.. ఆ విషయాన్ని ప్రధాని మోదీదృష్టికి తీసుకెళ్లాలనుకుంది. ఇందుకోసం తన స్కూల్‌ను చూపిస్తూ ఓ సెల్ఫీ వీడియో తీసింది. దాదాపు 5 నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియోలో ఆ బాలిక తన స్కూల్ పరిస్థితిని వివరించి.. సాయం చేయాలని ప్రధానిని అభ్యర్థించింది. ఆ తర్వాత తన పాఠశాల కాంపౌండ్‌లో నడుస్తూ ‘మోదీ-జీ’ మా స్కూల్‌లో మౌలిక వసతులు మెరుగుపరచడానికి చర్యలు తీసుకోండి అని అభ్యర్ధించింది. ఫోన్ కెమెరాను తలుపులు మూసివున్న ఓ గది ముందు ఉంచి..‘ప్రిన్సిపాల్ ఆఫీస్, స్టాఫ్ రూమ్’ అని వివరించింది. ఫ్లోర్లింగ్ ఎంత మురికిగా ఉందో చూడండి.. దీనిపైనే మమ్మల్ని కూర్చోబెడతారు అని ఆవేదన వ్యక్తం చేసింది.
Read Also: Ukraine War: వీకిపీడియాకు మాస్కో కోర్టు షాక్.. ఉక్రెయిన్ యుద్ధంపై కథనం రాసినందుకు జరిమానా
గత ఐదేళ్లుగా ఈ భవనం ఇలాగే ఉందని తెలిపింది. బెంచీలు లేక నేల మీదే కూర్చుంటున్నాం. నేల మట్టికొట్టుకుపోయి చెత్తగా ఉంది. దీంతో మా యూనిఫామ్‌కు దుమ్ము అంటుకుని మాసిపోతోంది. అది చూసి మా అమ్మలు మమ్మల్ని తిడుతున్నారు. టాయిటెల్ చూడండి ఎంత ఘోరంగా పగిలిపోయి ఉందో..! గత ఐదేళ్లుగా ఈ బిల్డింగ్ ఇలాగే ఉంది. మీకు భవనం లోపల ఎలా ఉందో కూడా చూపిస్తాను చూడండి. మోదీజీ మీరు దేశం మొత్తం మాట వింటారు కదా..! నా మాట కూడా వినండి ప్లీజ్. మాకో మంచి స్కూల్‌ను కట్టించండి. అప్పుడు మేం బాగా చదువుకోగలం. ప్లీజ్ మాకు సాయం చేయండి’’ అని చిన్నారి సీరత్ తన వీడియోలో ప్రధానిని కోరింది.జమ్మూకశ్మీర్‌కు చెందిన మార్మిక్ న్యూస్ అనే స్థానిక మీడియా సంస్థ ఈ చిన్నారి వీడియోను తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారడం గమనార్హం.
Dear PM Sir,
Please look into.https://t.co/xqnBrE62dC
— Sandeep Jha (@JHASandeep1246) April 7, 2023