Site icon NTV Telugu

Liquor shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. రాజధానిలో 4రోజులపాటు వైన్ షాపులు బంద్

Liquor Shops

Liquor Shops

Liquor shops Closed: మద్యం ప్రియులకు చేదు వార్త. రాబోయే పండుగల కోసం ఢిల్లీ ప్రభుత్వం 4 డ్రై డేలను ప్రకటించింది. మొహర్రం, స్వాతంత్ర్య దినోత్సవం, జన్మాష్టమి, ఈద్-ఎ-మిలాద్ నాడు ఢిల్లీలో మద్యం దుకాణాలు మూసివేయబడతాయని ప్రభుత్వం తెలిపింది. జూలై 29న మొహర్రం. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది కాకుండా సెప్టెంబర్ 7న జన్మాష్టమి, సెప్టెంబర్ 28న ఈద్-ఎ-మిలాద్. ఈ తేదీల్లో ఢిల్లీలోని మద్యం దుకాణాలు మూసివేయబడతాయి.

దేశంలో త్వరలో పండుగల సీజన్‌ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున మద్యం షాపులను మూసివేయాలని ఇప్పటికే నిబంధన ఉంది. స్వాతంత్ర్య దినోత్సవం నాడు డ్రై డే అని ఇప్పటికే ప్రకటించబడింది. అంతే కాకుండా పండుగల దృష్ట్యా మద్యం దుకాణాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు తమ తరపున నిర్ణయం తీసుకోవచ్చు. ఈ నాలుగు ప్రత్యేక రోజుల్లో మద్యం దుకాణాలను మూసి ఉంచాలని ఎక్సైజ్ శాఖ సీఎంకు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. అనంతరం ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆమోదం తెలిపారు. ప్రతి మూడు నెలలకోసారి ఢిల్లీ ప్రభుత్వం డ్రై డే జాబితాను విడుదల చేస్తుంది.

Read Also:Telangana : బిగ్ బ్రేకింగ్.. విద్యాసంస్థల సెలవు పొడిగింపు..

ఎక్సైజ్ శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ, “ఎక్సైజ్ నిబంధనల ప్రకారం, డ్రై డేస్‌లో లైసెన్స్ హోల్డర్లు మద్యం విక్రయించడానికి అనుమతించబడరు. ఈ రోజున హోటల్‌లు, బార్‌లు, క్లబ్‌లు లేదా కొన్ని ఇతర ప్రదేశాలకు ఈ పరిమితి వర్తించదు. అయితే, స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈ ప్రదేశాలన్నింటిలో మద్యం సేవించడం నిషేధించబడింది. ప్రస్తుతం ఢిల్లీలో ఏడాదికి దాదాపు 21 డ్రై డేలు ఉన్నాయి. అయితే, ఢిల్లీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చినప్పుడు, అకస్మాత్తుగా ఈ డ్రైడేస్‌ను 21 నుండి 3కి తగ్గించారు. అయితే, ఇందులో ఆరోపించిన స్కామ్‌లకు సంబంధించి సీబీఐ కేసు నమోదు చేయడంతో ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ విధానం 2021-22ని ఉపసంహరించుకుంది.

ప్రతి సంవత్సరం ఎక్సైజ్ శాఖ డ్రై డేల షెడ్యూల్‌ను జారీ చేస్తుంది. ఎన్నికలు, మరికొన్ని ప్రత్యేక సందర్భాలలో డ్రై డేల సంఖ్య పెరగవచ్చని అధికారి తెలిపారు. ఒక సంవత్సరంలో ఎన్ని డ్రై డేస్ ఉంటాయో ఆ సంఖ్య స్థిరంగా లేదు ప్రభుత్వం దానిలో వీలును బట్టి మార్పులు చేయవచ్చు.

Read Also:TS Rains: తెలంగాణకు కొనసాగనున్న రెడ్ అలెర్ట్.. ప్రజలకు ఐఎండీ వార్నింగ్..

Exit mobile version