Site icon NTV Telugu

Liquor Sales: ఏపీలో భారీగా పెరిగిన మధ్యం సేల్స్‌.. దాచేస్తున్నారా..?

Liquor Sales

Liquor Sales

Liquor Sales: ఆంధ్రప్రదేశ్‌లో మార్చి, ఏప్రిల్ నెలల్లో గతంలో కంటే మద్యం అమ్మకాలు బాగా పెరిగాయి.. ముఖ్యంగా మార్చి నెలలోనే మద్యం అమ్మకాలు భారీగా జరిగాయి.. ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు మార్చి మొదటి అర్ధ భాగంలోనే చాలా జిల్లాల్లో మద్యం సేల్స్ విపరీతంగా జరిగాయి.. అంటే చాలా చోట్ల మద్యం బాటిళ్లు కొనుగోలు చేసి దాచారు అనడానికి ఈ అమ్మకాలు నిదర్శనంగా చెప్పచ్చు.. అదే ఏప్రిల్ నెల అమ్మకాలు చూస్తే కట్టడి చేసేందుకు చర్యలు పెంచడం, ఎక్కడికక్కడ సీజ్ లు, సస్పెన్షన్ లు, షోకాజ్ నోటీసులు ఇస్తుండటంతో మార్చిలో కంటే సేల్స్ తగ్గాయని అధికారులు అంటున్నారు.. అయితే, ముందే మందు దాచేసుకోవడంతో కొనుక్కోవాల్సిన అవసరం రాలేదేమో అనిపించక మానదు.. అయితే, రాష్ట్రంలో మద్యం సేల్స్ పెరగకుండా కట్టడికి చర్యలు తీసుకుంటున్నాం అంటున్నారు ఏపీ ఎక్సైజ్ అదనపు కమీషనర్ దేవకుమార్. కాగా, ఎక్కడైనా సాధారణ రోజుల్లో కంటే ఎన్నికల సమయంలో లిక్కర్‌ సేల్స్‌ ఎక్కువగా జరుగుతాయని గత గణాంకాలు చెబుతున్నాయి.. ఇప్పుడు ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలు కూడా జరుగుతుండడంతో.. లిక్కర్‌కు ఫుల్‌ డిమాండ్‌ ఉందని.. ఎన్నికల సమయంలో పచ్చడం కోసమే.. ముందస్తుగా కొనుగోలు చేసి.. నిల్వ చేస్తున్నారనే విమర్శలు, ఆరోపణలు లేకపోలేదు.

Read Also: V. Hanumantha Rao: ప్రధాని దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారు

Exit mobile version