ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరోసారి ఆప్ నేత మనీష్ సిసోడియాకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది. ఏప్రిల్ 18 వరకు కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయిం తీసుకుంది. శనివారం ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో సిసోడియాను పోలీసులు హాజరపర్చారు. దీంతో ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఈనెల 18 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించారు. మద్యం కుంభకోణంలో తన ప్రమేయాన్ని కేంద్ర ఏజెన్సీలు ఇంకా రుజువు చేయలేదని సిసోడియా పేర్కొన్నారు.
ఇది కూాడా చదవండి: Tillu Square : 100కి దగ్గరైన టిల్లు గాడు.. రంగంలోకి యంగ్ టైగర్..
మనీష్ సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఫిబ్రవరి 26, 2023 న లిక్కర్ స్కామ్‌లో అరెస్టు చేసింది. అనంతరం మార్చి 9, 2023న మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా అరెస్టు చేసింది. ఇక ఫిబ్రవరి 28, 2023న ఢిల్లీ కేబినెట్ నుంచి సిసోడియా తప్పుకున్నారు. తన పదవికి రాజీనామా చేశారు.
ఇది కూాడా చదవండి: Smriti Irani: ఢిల్లీలో హగ్గింగ్, కేరళలో బెగ్గింగ్..
గత ఏడాది నుంచి సోసిడియా జైల్లో ఉన్నారు. ఇప్పటి వరకు ఆయనకు బెయిల్ లభించలేదు. శుక్రవారం తన నియోజకవర్గ ప్రజలకు మాత్రం ఓ లేఖ రాశారు. తాను త్వరలోనే జైలు నుంచి బయటకు వస్తానని లేఖలో పేర్కొన్నారు. త్వరలోనే అందర్ని కలుస్తానని పేర్కొన్నారు. తప్పుడు కేసులో తనను జైల్లో పెట్టారని.. ఎన్నో ఏళ్లు జైలు జీవితం గడిపిన మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా తనకు ఆదర్శమని సిసోడియా చెప్పుకొచ్చారు. జైల్లో ఉన్నాక నియోజకవర్గ ప్రజలపై ప్రేమ పెరిగిందని.. తనకు బలం ప్రజలేనని చెప్పుకొచ్చారు. త్వరలోనే మిమ్మల్ని కలుసుకుంటానని సిసోడియా ధీమా వ్యక్తం చేస్తూ లేఖలో పేర్కొన్నారు. సోసిడియా తూర్పు ఢిల్లీలోని పట్పర్‌గంజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఇది కూాడా చదవండి: Tillu Square : 100కి దగ్గరైన టిల్లు గాడు.. రంగంలోకి యంగ్ టైగర్..
ఇక ఇదే కేసులో ఆప్ నేత సంజయ్ సింగ్‌కు బెయిల్ లభించింది. ఇటీవలే ఆయన తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఇక ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా తీహార్ జైల్లోనే ఉన్నారు. ఆయన కూడా బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం హైకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉంది. జైలు నుంచే కేజ్రీవాల్ పరిపాలన సాగిస్తున్నారు. ఒకవేళ బెయిల్ రాకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయొచ్చని తెలుస్తోంది. ఒకవేళ కేజ్రీవాల్ రాజీనామా చేస్తే.. ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూాడా చదవండి: Congress: లోక్‌సభ అభ్యర్థుల మరో జాబితా విడుదల