Site icon NTV Telugu

Messi vs Revanth Reddy: నేడు రేవంత్‌రెడ్డి vs మెస్సీ మ్యాచ్.. టైమ్, పూర్తి వివరాలు ఇవే..

Messi Revanth

Messi Revanth

Messi vs Revanth Reddy: ఫుట్‌బాల్ దిగ్గజం, ఆల్‌టైమ్ గ్రేట్ లయోనల్ మెస్సీ vs సీఎం రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ మ్యాచ్ నేడు (శనివారం) ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌కు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి 7గంటలకు ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచ్‌లో మెస్సీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ మ్యాచ్ కోసం దాదాపు 3,000 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అయితే.. ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చాయి. షెడ్యూల్ లో భాగంగా డిసెంబర్ 13 (శనివారం)న మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య కోల్‌కతా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటాడు. శంషాబాద్ చేరుకున్న వెంటనే మెస్సీ నేరుగా తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళతాడు. అక్కడ గంటపాటు అభిమానులతో ప్రత్యేకమైన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మెస్సీతో ఫొటో దిగేందుకు 10 లక్షల రూపాయలు చెల్లించి ముందుగానే స్లాట్లు బుక్ చేసుకున్న 100 మంది అదృష్టవంతులతో స్టార్ ప్లేయర్ ముఖాముఖీగా మాట్లాడి, ఫోటోలు దిగనున్నాడు.

READ MORE: Jagtial District: తమ్ముడు ఎన్నికల్లో ఓటమి.. గుండెపోటుతో అక్క మృతి..

ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు మెస్సీ ఉప్పల్ స్టేడియంకు చేరుకుంటారు. అక్కడ చిన్నారుల ఫుట్‌బాల్ జట్టుతో 15 నిమిషాలపాటు సంభాషించి, కొన్ని ఫుట్‌బాల్ మెళకువలు తెలపనున్నాడు. ఆపై సాయంత్రం 7 గంటలకు ప్రధాన ఈవెంట్ ప్రారంభం కానుంది. ఇందులో సంగీత కార్యక్రమం సహా పలు ఆకర్షణలు ఉంటాయి. 7.30కి ప్రత్యేక మ్యాచ్ జరుగనుంది. సింగరేణి RR జట్టుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం వహిస్తుండగా.. అపర్ణ మెస్సీ టీమ్ తరఫున మెస్సీ ఆడనున్నారు. మెస్సీతో పాటు అతని స్నేహితులైన రోడ్రిగో, లూయిస్ సురేజ్ కూడా ఈ మ్యాచ్‌లో పాల్గొనబోతున్నారు. అయితే మ్యాచ్ చివరి ఐదు నిమిషాల్లో మాత్రమే మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి గ్రౌండ్‌లోకి ప్రవేశించి ఆడనున్నారు. మ్యాచ్ అనంతరం విజేత జట్టుకు GOAT ట్రోఫీని మెస్సీ, రేవంత్ రెడ్డి కలిసి ప్రధానం చేయనున్నారు. ఈవెంట్ ముగిసిన తర్వాత మెస్సీ తిరిగి ఫలక్‌నుమాకు వెళ్లి అక్కడే రాత్రి బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం ముంబైకి పయనమవుతారు.

READ MORE: Shahbaz Sharif: ఘోర అవమానాన్ని తట్టుకోలేని పాక్ ప్రధాని.. డోర్లు నెట్టిసి పుతిన్ గదిలోకి దూసుకెళ్లిన వైనం..

Exit mobile version