Site icon NTV Telugu

Lifestyle: పెళ్ళైన మగవాళ్ళు ఎక్కువగా అక్కడే ఎందుకుంటారో తెలుసా?

Mens

Mens

పెళ్లికి ముందు కింగ్..పెళ్లి తర్వాత పరిస్థితులు అలానే ఉన్నాయని కొందరు మగవారిని చూస్తే తెలుస్తుంది..పెళ్లికి ముందు నడి ఇంట్లో దర్జాగా ఉన్న పెళ్లి తర్వాత ఎక్కువ సమయం బాత్ రూమ్ లోనే గడుపుతుంటారని చాలా మంది ఆడవాళ్లు అంటుంటారు.. తమ భర్తలు బెడ్ రూమ్‌లో కంటే బాత్ రూమ్‌లోనే ఉంటారని కామెడీగా చెప్పినప్పటికీ అది నిజంగా నిజం. అసలు పెళ్ళైన మగవారు బాత్‌రూమ్‌లో ఎక్కువ సేపు కాలం గడిపేందుకు కారణాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

వాళ్ళు అలా బాత్ రూమ్ లో ఉండటానికి ముఖ్య కారణం పనుల నుంచి తప్పించుకోవడానికే అని నిపుణులు అంటున్నారు.. భార్యల నుంచి ఇంటి పనుల నుంచి తప్పించుకోవాలని కావాలని ఎక్కువ సమయం అక్కడే గడుపుతారట.. ముఖ్యంగా గొడవలు జరగవని భావిస్తారని ప్రముఖులు చెబుతున్నారు.. కొంతమందికి జోక్‌గా కూడా అనిపిస్తుంది. చాలా మంది మగవారు ఇంటి పనులు చేయడానికి అంతగా ఇష్టపడరు. అలాంటి వారు భార్య చెప్పే పనులను తప్పించుకునేందుకు బాత్రూమ్‌కి వెళ్తామని చెబుతున్నారు.. కొంతమంది మగవాళ్లకు దుమ్ము దులపడం, గిన్నెలు కడగడం వంటి పనులను చేసేందుకు చాలా మందికి ఇష్టముండదు. అందుకోసమే బాత్రూమ్‌కి వెళ్తారట.అంతేకాదండోయ్.. అక్కడ కూర్చుని నిద్రకూడా పోతారు..

ఇలా ఎందుకు చేస్తారంటే వారిని ఆ ప్లేస్‌లో ఎవరు డిస్టర్బ్ చేయరట. ఏ అరుపులు, గోలలు ఉండవని చెబుతున్నారు మగవారు. అందుకే అక్కడ పగటిపూట పడుకోవడం ఉత్తమమని అక్కడికి వెళ్ళి నిద్రపోతారట.. టాయిలెట్ సీట్‌పై కూర్చొని చాలా మంది సోషల్ మీడియా తో కాలం గడుపుతుంటారట. సీక్రెట్‌గా సోషల్ మీడియాలో కొంతమంది తో చాట్ చేయడం, వారి ప్రొఫైల్ చెక్ చేస్తుంటారట.. అలా వారు కొంత రిలాక్స్ అవుతారట.. ప్రైవసీ కోసమో, మరో ఇతర కారణం కోసమో చాలా మంది బాత్‌రూమ్‌లో ఎక్కువగా సమయాన్ని గడుపుతున్నారని అంటున్నారు.. అదండి అసలు మ్యాటర్…

Exit mobile version