Site icon NTV Telugu

Lifestyle : పెళ్లయిన మగవాళ్ళు వేరే స్త్రీలను ఎందుకు ఇష్ట పడతారో తెలుసా?

Illegal Affairs

Illegal Affairs

ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న అక్రమ సంబంధాలు.. ఇంట్లో అందంగా ఉన్న భార్య ఉన్నా కూడా వేరే మహిళను చూసి సొంగ కారుస్తున్నారు.. వాటికారణంగా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.. తమ జీవితాలను నాశనం చేసుకోవడమే కాకుండా పిల్లల జీవితాలను కూడా అంధకారంలోకి నెడుతున్నారు. మరి అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి అసలు కారణాలు ఏంటి? ముఖ్యంగా పెళ్లైన మగవాళ్ళు పరాయి స్త్రీలపై మోజుపడడానికి అసలు కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…

 

పెళ్ళాం ఎంత అందంగా అప్సరసలాగా ఉన్నా కూడా పిల్లలు పుట్టాక ఇష్టం తగ్గిపోవడం వల్ల వేరే వారికి ఆకర్షతులు అవుతున్నారు.. భార్య శరీరంలో కూడా మార్పులు రావడంతో ఆమెపై ఇష్టం పోయి అందంగా ఉండే పరాయి స్త్రీలపై మోజు పడుతూ ఉంటారు. ఇలాంటి టైం లో ఎవరైనా ఇష్టమైన అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయి కూడా అలాంటిదే అయితే వారితో అక్రమ సంబంధం పెట్టుకుంటూ వారి జీవితాలను నాశనం చేసుకుంటారు.. అంతేకాదువయస్సు రాకముందే పెళ్లి చేసుకోవడం వల్ల కూడా వేరే మహిళలకు ఆకర్షతులు అవుతున్నారు..

అలాగే భార్యతో కలయిక విషయంలో సంతృప్తి పొందక పోయినా కూడా ఇతర స్త్రీలపై మోజు పడుతూ ఉంటారు. అంతేకాకుండా తరచూ ఇంట్లో భార్య భర్తలు గొడవ పడుతుంటే కూడా భర్త ఆ విషయంలో కూడా విసిగిపోయి బయట స్త్రీలపై ఇష్టం పెంచుకుంటాడు. ఈ కారణాల వల్లే పెళ్లైన మగవాళ్ళు ఇతర స్త్రీలతో అక్రమ సంబంధం పెట్టుకుంటారు… ఇలాంటి ఒక్కో కారణం చేత వేరే స్త్రీల ను పై ఇష్టాన్ని పెంచుకుంటున్నారు.. ఆ పరిచయాలే ఇలా సంబంధాలకు కారణం అవుతున్నాయని ప్రముఖులు చెబుతున్నారు.. కొందరు ఏకంగా కుటుంబాలను కూడా వదిలేస్తారు.. లేదా ప్రాణాలను కూడా వదిలేస్తున్నారు.. అసలు నిజం ఇదండి.. మనం బోర్ కొట్టామని భార్యలు ఆ పని చేస్తే ఊరుకుంటారా .. ఆ ఆలోచననే సహించలేరు కదా.. సో మనం కూడా అలానే ఉండాలి కదా.. ఇది గుర్తుంచుకుంటే బెస్ట్..

Exit mobile version