Site icon NTV Telugu

Lifestyle : భార్యను సంతోష పెట్టాలంటే భర్త ఏం చెయ్యాలో తెలుసా?

Couple

Couple

ఆడవాళ్లకు కోరికలు ఎక్కువగానే ఉంటాయి.. చిన్నదానికి కూడా పెద్దగా రియాక్ట్ అవ్వడం వాళ్ల నైజం.. ఇక భర్తలను అస్సలు అర్థం చేసుకోరు.. మీ భార్యలు మీ నుంచి ఏం కోరుకుంటారో.. ఎలాంటి పనులు వారిని సంతోషపెట్టాలంటే ఏం చేయాలో ఓసారి చూద్దాం…

చాలా మంది మగవాళ్ళు భార్యలను సుఖ పెట్టరు.. వారికి ఏం కావాలో అర్థం చేసుకోరు.. వారు కోరుకునేది భర్త తీర్చడం లేదనే భార్యలు దాదాపు ఎక్కువగా కోపంగా ఉంటారు. కానీ.. అది తెలుసుకోకుండా…తమ భార్యలను అర్థం చేసుకోవడం కష్టమని.. ఏం చేసినా సంతోషంగా ఉండరు అని అనుకుంటారు. కానీ.. నిజానికి.. మీ భార్యలు మీ నుంచి ఏం కోరుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం..

భార్యా, భర్తల మధ్య నమ్మకం అనేది ఉండాలి.. ఇంటి బాధ్యత ఇక భార్యది కాదు, భార్య వాటా కాకూడదు, ఇంటి పనులన్నింటిలో ఆమెకు సహాయం చేస్తే, ఆమె కూడా సంతోషంగా ఉంటుంది. పని త్వరగా జరుగుతుంది. ఇలా చెయ్యడం వల్ల మీపై వారికి ప్రేమ పెరుగుతుంది.. చాలా మంది మగవాళ్ళు తన భార్యల పై ఎప్పుడూ కోపంగా ఉంటారు.. ప్రేమను , ప్రశంసలను వ్యక్తం చేయడానికి చాలా సిగ్గుపడతారు. మీరు కూడా ఈ తప్పు చేస్తుంటే ఇప్పుడే సరిదిద్దండి. ఎందుకంటే సంబంధంలో మీ భార్యను సంతృప్తి పరచడానికి ఇది ఒక మార్గం..

మీరు వారితో గడపడానికి సమయాన్ని వెచ్చించండి. వారి రోజు ఎలా ఉందో తెలుసుకోండి, వారి సమస్యలు , ఆందోళనలను అర్థం చేసుకోండి.. వారి భయాన్ని పోగొట్టాలి.. నేనున్నా అనే భరోసా ఇవ్వాలి.. మహిళలు ఎక్కువగా సర్ ప్రైజ్ ను ఇష్టపడతారు. కాబట్టి, కనీసం నెలకు ఒకసారి వారికి సర్ ప్రైస్ ఇవ్వడం మర్చిపోవద్దు.. ఇవన్నీ చేస్తే ఆడవాళ్లు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు..

Exit mobile version