Site icon NTV Telugu

Lic Super Plan :సూపర్ ప్లాన్..రూ.87 రూపాయలతోరూ.11 లక్షలు రాబడి.. ఎలాగంటే?

Licc

Licc

కరోనా తర్వాత చాలా మంది ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకుంటున్నారు.. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అతి బీమా కంపెనీ ఎల్ఐసీకూడా అనే స్కీమ్ లను అందిస్తుంది.. అందులో కొన్ని పథకాలు ప్రజల మన్ననలు పొందాయి.. అందులో మహిళల కోసం అదిరిపోయే స్కీమ్ ఒకటి ఉంది.. అదే ఆధార్ శిలా పథకంలో పెట్టుబడిదారులు రోజుకు రూ.87 మాత్రమే ఇన్వెస్ట్ చేసి, రూ.11 లక్షల వరకు బెనిఫిట్ ను పొందవచ్చు.. ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ ప్లాన్ అనేది నాన్‌లింక్డ్‌ ఇండివిడ్యువల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌. మహిళా పాలసీదారుల కోసం రూపొందించారు. ఈ ప్లాన్‌లో భాగంగా.. ఇన్సూరెన్స్‌ పొందిన వ్యక్తికి మెచ్యూరిటీ తర్వాత ఫిక్స్‌డ్‌ అమౌంట్‌ అందిస్తారు. ఆమె అకాల మరణం చెందితే కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేస్తారు.. ఉదాహరణకు ఓ 55 ఏళ్ల వయస్సున్న ఓ మహిళ 15 ఏళ్ల పాటు రూ.87  ఇన్వెస్ట్‌ చేయడం ప్రారంభించారు. మొదటి సంవత్సరంలో కాంట్రిబ్యూట్‌ చేసిన మొత్తం రూ.31,755 అవుతుంది. పదేళ్లకు కాంట్రిబ్యూట్‌ చేసిన అమౌంట్‌ రూ.3,17,550కి చేరుతుంది. చివరగా 70 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత, ఇన్సూరెన్స్‌ పొందిన వ్యక్తి మొత్తం రూ.11 లక్షలు పొందేందుకు అర్హులు..

ఈ ప్లాన్ ను తీసుకొనేందుకు గాను వయస్సు 8 ఏళ్ల నుంచి 55 సంవత్సరాలు ఉండాలి.. పెట్టుబడిదారులు కనీసం 10 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి, గరిష్టంగా 20 సంవత్సరాల వరకు పాలసీ వ్యవధి ఉండవచ్చు. గరిష్ట మెచ్యూరిటీ వయస్సు 70 సంవత్సరాలుగా ఉంది. ఆసక్తి ఉన్న పెట్టుబడిదారులు కనీసం రూ.75,000 నుంచి రూ.3 లక్షలను పొందవచ్చు.. ఈ పాలసీ వల్ల కలిగే ప్రయోజనాలు..

ప్రీమియం పేమెంట్‌ కాలవ్యవధి పాలసీ వ్యవధికి అనుగుణంగా ఉంటుంది. పాలసీదారు ఆర్థిక ప్రాధాన్యతలకు అనుగుణంగా యాన్యువల్‌, మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్‌ ఇయర్లీ చెల్లించవచ్చు..

లోన్ పొందెందుకు కూడా వీలు ఉంటుంది..

పాలసీదారులకు వరుసగా మొదటి రెండు పాలసీ సంవత్సరాలు పూర్తయిన తర్వాత వారి పాలసీని సరెండర్ చేసే అవకాశం ఉంటుంది. పాలసీ వ్యవధిలో చెల్లించాల్సిన హామీ సరెండర్ వ్యాల్యూ, చెల్లించిన మొత్తం ప్రీమియంతో సమానంగా ఉండాలి..

పాలసీదారు అకాల మరణం చెందితే, ప్లాన్ డెత్‌ బెనిఫిట్స్‌ అందిస్తుంది. పాలసీలో పేర్కొన్న నామినీకి డెత్‌ బెనిఫిట్స్‌ అందిస్తారు… ఇక పాలసీని మిస్ చెయ్యకుండా కట్టిన వాళ్లు మెచ్యూరిటీ బెనిఫిట్స్ ను కూడా పొందవచ్చు..

Exit mobile version