LIC: కాలం మారిన, ప్రైవేటు సంస్థలు పోటెత్తిన ఇన్సూరెన్స్ రంగంలో ఎల్ఐసీ స్థానం ఏమాత్రం తగ్గలేదు. దేశంలో ఎల్ఐసీ ఇప్పటికీ కోట్ల టర్నోవర్, ఆస్తులతో అగ్రస్థానంలో కొనసాగూతూనే ఉంది. వాస్తవానికి ఎల్ఐసీ కూడా కాలంలో పాటు మార్కెట్లోకి ప్రవేశించిన ప్రైవేటు పోటీని తట్టుకునేందుకు కొత్త పాలసీలతో జనాలను మరింతగా ఆకర్షించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. తాజాగా ఈ ప్రభుత్వ రంగ సంస్థ రెండు కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్లతో ప్రజల ముందుకు వచ్చింది. ఇంతకీ ఆ ప్లాన్ల వివరాలు ఏంటి, వాటితో ప్రజలకు చేకూరే మంచి ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: KCR: కేసీఆర్ ను కలిసిన ఏకగ్రీవంగా ఎన్నికైన ఆ గ్రామాల సర్పంచులు.. కీలక వ్యాఖ్యలు
*ఎల్ఐసీ ప్రొటెక్షన్ ప్లస్ ప్లాన్ 886..
ఎల్ఐసీ ప్రొటెక్షన్ ప్లస్ ప్లాన్ అనేది పూర్తిగా మార్కెట్‌తో అనుసంధానమైన ప్లాన్‌గా విశ్లేషకులు చెబుతున్నారు. ఇందులో విశేషం ఏమిటంటే బీమా, సేవింగ్స్ రెండూ కలిసి ఉండడం. వాస్తవానికి ఇందులో పాలసీదారుడికి పాలసీ ఉన్నన్నీ రోజులు బీమా రక్షణ ఉంటుంది. ఇందులో టాప్ అప్ ఎంచుకునే వెసులుబాటు, అలాగే ఐదేళ్ల తర్వాత పాక్షిక్షంగా డబ్బును ఉపసహరించుకునే అనుమతి కూడా ఉంది. ఈ పాలసీ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్‌ను ఐదు ఫండ్ లుగా తీసుకోవచ్చు. ఇందులో బాండ్ ఫండ్, సెక్యూర్డ్ ఫండ్, బ్యాలెన్స్ డ్ ఫండ్, గ్రోత్ ఫండ్, ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్ వంటి ఐదు ప్లాన్లు ఉన్నాయి. రెగ్యులర్ పే, లిమిటెడ్ పే ఆప్షన్లతో మన దగ్గర ఉన్నంత డబ్బును వేసుకునే స్వేచ్ఛను ఈ పాలసీలో ఇవ్వడం విశేషం. ఈ పాలసీ తీసుకునేందుకు 18 – 65 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారికి అర్హత ఉంది. ఈ ప్లాన్‌లో 5, 7, 10, 15 ఏళ్లు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. దీనికి 10, 15, 20, 25 ఏళ్లు పాలసీ టర్మ్ ఉంది. పాలసీదారుడికి ఏదైనా ప్రమాదం జరిగితే చెల్లించిన మొత్తం ప్రీమియంకు 105 శాతం తిరిగి వారి కుటుంబానికి చెల్లిస్తారు.
*ఎల్ఐసీ బీమా కవచ్ ప్లాన్ 887..
ఎల్ఐసీ దీనిని వ్యక్తిగత నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌గా ప్రజల ముందుకు తీసుకొచ్చింది. దీనిని పూర్తి రిస్క్ ప్రొటెక్షన్ ప్లాన్‌గా అందుబాటులోకి తీసుకొచ్చారు. అంటే టర్మ్ పాలసీ తరహాలో అని అర్థం. కుటుంబాలకు ఆర్థిక రక్షణ ఇవ్వడానికి ఈ పాలసీ విశేషంగా ఉపయోగపడుతుంది. ఫిక్డ్స్ మొత్తం అయినా కట్టొచ్చు, లేదంటే సంవత్సరానికోసారి కొంత మొత్తాన్ని చెల్లించవచ్చు. 18-65 ఏళ్ల వయసు వారు ఈ ప్లాన్‌కు అర్హులు. ఈ పాలసీ రూ.2కోట్ల బీమా హామీతో ప్రారంభమవుతుంది. రూ.5 లక్షలు చొప్పున ఎంతైనా పెంచుకోవచ్చు. దీనిలో గరిష్ట మొత్తంపై ఎలాంటి పరిమిత లేదు. సింగిల్ పేమంట్ గానైనా.. 5, 10, 15, ఏళ్లు ప్రీమియం అయినా చెల్లించవచ్చు. మీరు తీసుకున్న టర్మ్ ఆధారంగా ఈ ప్లాన్ ప్రీమియం మొత్తం ఉంటుంది.
సింపుల్‌గా చెప్పాలంటే ఎల్ఐసీ తీసుకొచ్చిన బీమా కవచ్ ప్లాన్ 887 అనేది టర్మ్ పాలసీ లాంటింది. దీనిని తీసుకున్న కుటుంబంలోని ఇంటి పెద్ద మరణిస్తే ప్రీమియం కట్టిన ఆ కుటుంబానికి రూ.2 కోట్ల నుంచి ఎక్కువ మొత్తం ఒకేసారి వస్తుంది. ఇక రెండో పాలసీ విషయానికి వస్తే ఎల్ఐసీ ప్రొటెక్షన్ ప్లస్ ప్లాన్ 886. ఇది మార్కెట్ లింక్డ్ పెట్టుబడి ఆధారంగా ఎక్కువ మొత్తం డబ్బులు రావడానికి ప్రవేశపెట్టిన స్కీమ్. ఇప్పటికే ఈ రెండూ స్కీమ్‌లను ప్రైవేటు కంపెనీలు అమలు చేస్తున్నాయి. ఇదే సమయంలో ఎల్ఐసీ కూడా ఈ ప్లాన్స్‌ను ప్రజల ముందుకు తీసుకువచ్చింది.
READ ALSO: Nishant Kumar: రాజకీయాల్లోకి సీఎం కొడుకు..
LIC of India introduces new plans -LIC's Protection Plus (Plan 886)& LIC's
Bima Kavach (Plan 887)#LIC #newlaunch #bimakavach #protectionplan #newplan pic.twitter.com/q1SSQavBys— LIC India Forever (@LICIndiaForever) December 3, 2025
