LG 2026 AI TV: భారత మార్కెట్లో LG ఎలక్ట్రానిక్స్ ఇండియా (LGEIL) నుండి 2026 AI TV లైనప్ ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ కొత్త సిరీస్‌లో OLED evo, QNED evo Mini LED, Micro RGB evo, Mini RGB evo, Nano 4K UHD టీవీలతో పాటు మొత్తం 25 అల్ట్రా-లార్జ్ స్క్రీన్ మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. 75 అంగుళాల నుంచి 115 అంగుళాల వరకు స్క్రీన్ సైజ్‌లలో ఈ టీవీలు లభించనున్నాయి. ముఖ్యంగా 115 అంగుళాల QNED evo Mini LED TVను భారత మార్కెట్లో తొలిసారిగా LG పరిచయం చేసింది.
115-అంగుళాల భారీ టీవీ:
LG QNED evo Mini LED సిరీస్‌లో QNED90, QNED86, QNED85, QNED82, QNED70 మోడళ్లు ఉన్నాయి. ఎంపిక చేసిన మోడళ్లలో Alpha 8 AI Processor Gen3 ప్రాసెసర్‌తో పాటు Dynamic QNED Color Pro టెక్నాలజీని అందించారు. ఈ సిరీస్ ముఖ్య ఫీచర్లలలో ప్రెసిషన్ డిమ్మింగ్ అల్ట్రా టెక్నాలజీ, వేల సంఖ్యలో డిమ్మింగ్ జోన్లు, 330Hz వరకు మోషన్ బూస్టర్, 165Hz VRR సపోర్ట్, ఆటో లో లాటెన్సీ మోడ్ (ALLM) ముఖ్యంగా ఉన్నాయి.
OLED evo G6, C6, B6 సిరీస్:
LG OLED evo G6, OLED evo C6, OLED B6 మోడళ్లను కూడా విడుదల చేసింది. OLED evo G6లో ఆల్ఫా 11 డ్యూయల్ AI ఇంజిన్ ప్రాసెసర్ Gen3, బ్రైట్నెస్ బూస్టర్ అల్ట్రా, హైపర్ రేడియంట్ కలర్, డాల్బీ విజన్, డాల్బీ ఆటమ్స్, NVIDIA G-Sync, AMD FreeSync ప్రీమియం, 4K 165Hz VRR గేమింగ్, సాధారణ OLEDతో పోలిస్తే 3.9 రెట్లు ఎక్కువ బ్రైట్‌నెస్, 3 సంవత్సరాల ప్యానెల్ వారంటీ లభిస్తాయి. OLED evo C6లో AI Sound Pro (Virtual 11.1.2 ఛానెల్ ఆడియో), పర్ఫెక్ట్ బ్లాక్, పర్ఫెక్ట్ కలర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. OLED B6లో ఆల్ఫా 8 AI ప్రాసెసర్ Gen3, డాల్బీ విజన్, డాల్బీ ఆటమ్స్, AI సౌండ్ ప్రో వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
Micro RGB evo, Mini RGB evo టీవీలు:
LG తొలిసారిగా 100-అంగుళాల Micro RGB evo (MRGB96) టీవీని కూడా భారత మార్కెట్లో తీసుకొచ్చింది. ఇందులో ట్రిపుల్ 100% కలర్ కవరజ్, BT.2020, DCI-P3, Adobe RGB కలర్ స్పేస్ సపోర్ట్, TÜV Rheinland సర్టిఫికేషన్, ఆల్ఫా 11 AI ప్రాసెసర్ Gen3, డాల్బీ విజన్, డాల్బీ ఆటమ్స్ వంటి ముఖ్య ఫీచర్లు ఉన్నాయి. అలాగే Mini RGB evo (MRGB85) సిరీస్‌లో Tandem LED టెక్నాలజీ, ప్రెసిషన్ డిమ్మింగ్, ఆల్ఫా 8 AI ప్రాసెసర్ Gen3 అందించారు. వీటితో LG Nano 4K UHD సిరీస్‌లో గరిష్టంగా 98-అంగుళాల మోడల్‌ను పరిచయం చేసింది. ఇందులో నానో డీటెయిల్ ఎన్హన్సర్, HDR10 ప్రో, ఆల్ఫా 7 AI ప్రాసెసర్ Gen9, డాల్బీ ఆటమ్స్, లినియర్ ఫ్లో డిజైన్ ఫీచర్లు ఉన్నాయి.
ధరలు:
QNED evo Mini LED –> రూ.52,990
OLED evo G6 –> రూ.2,14,990
OLED evo C6 –> రూ.1,19,990
OLED B6 –> రూ.1,47,490
Micro RGB evo –> రూ.12,99,990
Mini RGB evo –> రూ.1,28,990
Nano 4K UHD –> రూ.38,990
Smart AI TV LB65 –> రూ.19,990
LG 2026 AI TV సిరీస్ దేశవ్యాప్తంగా LG అధీకృత రిటైల్ స్టోర్లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో కొనుగోలుకు అందుబాటులోకి రానున్నాయి.

