Tiger in Telangana: తెలంగాణలో చిరుతల సంచారం హడలెత్తిస్తున్నాయి. దీంతో మెదక్, నిజామాబాద్ లో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. చిరుత సంచారంతో జిల్లా ప్రజలు భయాందోళన చెందుతున్నారు. బయటకు రావాలంటేనే జంకుతున్నారు. మెదక్ జిల్లాలో చిరుతపులి సంచారం స్థానికులు హడలెత్తుతున్నారు. అర్ధరాత్రి హావేలిఘనపూర్ మండలం నాగపూర్ గేటు వద్ద కారులో వెళ్తున్న ప్రయాణికులకు చిరుత కనిపించింది. దీంతో షాక్ తిన్న ప్రయాణికులు సెల్ ఫోన్ లో చిత్రీకరించి వీడియోను పోలీసులకు పంపించారు.
Read also: MLA KrishnaMohan Reddy: నేడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లోకి గద్వాల ఎమ్మెల్యే..
ఈ వీడియో కాస్త బయటకు రావడంతో.. సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. చిరుత వీడియో చూసిన పోలీసులు అలర్ట్ అయ్యారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారుల హెచ్చరించారు. భయట ప్రయాణించే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిల్లలను, మూగజీవాలపై కన్నువేసి ఉండాలని తెలిపారు. ఏ సమయంలోనైనా చిరుతను బంధిస్థామని అన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
Read also: Virat Kohli: విరాట్ కోహ్లీ మొబైల్ వాల్‌పేపర్‌గా ఆయన ఫోటో.. ఎవరీయన?
ఇక మరోవైపు నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో చిరుత కలకలం రేపింది. గ్రామానికి చెందిన కటికె గాంధీ తన మేకలను తీసుకుని మేత కోసం గుట్ట ప్రాంతంలో వెళ్లాడు. సాయంత్రం ఓ చిరుత అకస్మాత్తుగా వచ్చి మేకల మందపై దాడి చేసింది. ఒక మేకకు తీవ్ర గాయాలయ్యాయి. గాంధీ అప్రమత్తం కావడంతో చిరుత పారిపోయింది. మేకల మందతో ఊరు చేరుకున్నాడు. ఈ ఘటనపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో నిజామాబాద్ బీట్ అధికారి సుధీర్‌కుమార్, సెక్షన్ అధికారి జహూర్ ఘటనా స్థలానికి చేరుకుని వేలిముద్రలు సేకరించారు. చిరుత వలస నిజమేనని నిర్ధారించారు. ఏడాది క్రితం ఇదే ప్రాంతంలో చిరుతలు కనిపించాయి. చిరుతలు ఒకేచోట ఉండవని, రోజూ పదుల కిలోమీటర్లు నడిచే అలవాటు ఉందని ప్రజలు భయపడవద్దని అధికారులు సూచించారు.
Top Headlines @ 9 AM: టాప్ న్యూస్