Site icon NTV Telugu

Tiger Attack: బైకుపై వెళ్తున్న వ్యక్తిపై చిరుత దాడి.. ఆందోళనలో స్థానికుల పరుగు

Leopard Attacks

Leopard Attacks

Tiger Attack: మానవుడి స్వార్థం కోసం అడవులను సంహరించుకుంటూ పోవడంతో వన్యమృగాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో వాటి చూసి జనాలు భయపడుతున్నారు. వాటి నుంచి కాపాడుకునేందుకు దాడులు చేస్తుండడంతో అవి తిరగబడుతున్నాయి. అలాంటి ఓ ఘటనే కర్ణాటకలోని మైసూరులో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అటవీశాఖ అధికారి సుసాంత నందా సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా ఇప్పుడది తెగ వైరల్‌ అవుతోంది. జనావాసాల్లోకి వచ్చిన చిరుతను చూసిన భవనంపై ఉన్న వ్యక్తులు దానిపై రాళ్లు రువ్వారు. దీంతో బెదిరిపోయిన చిరుత తప్పించుకునే ప్రయత్నంలో రోడ్డుపైకి పరిగెత్తింది.

Read Also: students saved paddy: రైతు కష్టాన్ని కాపాడిన విద్యార్థులు.. ఏం చేశారంటే

అదే సమయంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తిపై దాడిచేసింది. దాడిలో అతడు బైకుపైనుంచి కిందపడ్డాడు. అది చూసిన మరో వ్యక్తి దానిని అదిలించే ప్రయత్నం చేశాడు. అది అతడిపైకి ఎదురుతిరిగింది. ఈ ఘటనల్లో వారిద్దరూ గాయపడ్డారు. అప్పటికే ఆందోళనలో ఉన్న చిరుతను వారు గందరగోళానికి గురిచేశారని, వారికి కనిపించడమే అది చేసిన తప్పు అని నందా ఆవేదన వ్యక్తం చేశారు. చిరుతను చూసిన వారు క్రూరంగా మారడంతో రక్షణ కోసం అది పోరాడిందన్నారు. అటవీశాఖ అధికారులు ఆ చిరుతను కాపాడినట్టు పేర్కొన్నారు.

Exit mobile version