NTV Telugu Site icon

Leopard in Home: చంద్రపూర్ జిల్లాలో ఇంట్లో దూరిన చిరుత

చిరుతపులులు (Leopards), ఎలుగుబంట్లు (Bears), ఏనుగులు (Elephants) జనావాసాల్లోకి వచ్చి నానా హడావిడి చేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో (Ap and Telangana) పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి కూడా చిరుతలు (Leopards) వస్తున్నాయి. తాజాగా ఓ ఇంట్లో దూరింది చిరుత. దీంతో యజమాని తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలో ఎక్కడినుంచి వచ్చిందో చిరుత ఇంట్లోకి ప్రవేశించింది. సింధేవాహి తాలూకా పరిధి కోట గ్రామంలో ఓ వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిందా చిరుతపులి. దీంతో ఇంటి తలుపులు మూసివేసి అటవీ శాఖ అధికారులకు (Forest Department) సమాచారం ఇచ్చారు యజమాని.

Read Also: Priyanka Gandhi: కాంగ్రెస్ కార్యకర్తలపై కేంద్రం దాడులు చేస్తోంది..

చిరుతను చూసేందుకు భారీ సంఖ్యలో తరలి వచ్చారు స్ధానికులు. అయితే, ఇంటి వైపు ఎవరిని రానీయకుండా చుట్టుపక్కల కర్రలు అడ్డంగా కట్టి రక్షణ ఏర్పాట్లు చేశారు. చిరుతను బంధించే ప్రయత్నం చేస్తున్నారు అటవీశాఖ అధికారులు. త్వరగా చిరుతను బంధించాలని ఇంటి యజమానితో పాటు స్థానికులు అటవీ అధికారులను కోరుతున్నారు.

Read Also: Virupaksha: ఇక వెయిటింగ్ లేదు మిత్రమా… అప్డేట్ లు మాత్రమే…

పులిదాడిలో వ్యక్తి మృతి

చంద్రాపూర్ జిల్లాలో పులి దాడిలో వ్యక్తి మృతి చెందాడు. నాగ్‌భిడ్ తాలూకాలోని విలం మసలి గ్రామానికి చెందిన కిషోర్ దాదాజీ వాఘ్మారే(37) చేనులో పని నిమిత్తం వెళ్ళగా అకస్మాత్తుగా దాడి చేసింది పులి. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు.