NTV Telugu Site icon

Leo Advance Bookings : భారీ ఓపెనింగ్స్ పై కన్నేసిన విజయ్ దళపతి లియో మూవీ ..

Whatsapp Image 2023 10 16 At 11.03.42 Pm

Whatsapp Image 2023 10 16 At 11.03.42 Pm

కొలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన లేటెస్ట్ మూవీ లియో.. ప్రస్తుతం ఈ మూవీ తమిళనాడు మరియు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తి రేపుతోంది. దళపతి విజయ్ నటించిన సినిమా కావడం తో లియో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే విక్రమ్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ లోకేస్ కనగరాజ్, విజయ్ దళపతి కాంబినేషన్ కావడంతో లియో మూవీ కూడా బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని భావిస్తున్నారు.అందుకు తగినట్లే ఈ లియో మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. అక్టోబర్ 19న రిలీజ్ కానున్న ఈ సినిమా ఏకంగా రూ.110 కోట్ల ఓపెనింగ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది.. అదే జరిగితే రజనీకాంత్ 2.0 మూవీ రూ.95 కోట్లతో క్రియేట్ చేసిన రికార్డు కూడా బ్రేకవుతుంది. అత్యధిక తొలి రోజు వసూళ్లు సాధించిన సినిమాగా లియో నిలుస్తుంది.ఈ సినిమా యూకేలో ఇప్పటికే రికార్డు క్రియేట్ చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో 70 వేల టికెట్లకు పైగా అమ్ముడయ్యాయి. అక్కడ అత్యధిక ఓపెనింగ్ సాధించిన ఇండియన్ సినిమాగా లియో మూవీ నిలవనుంది.

లియో మూవీ తొలి రోజే విదేశాల్లో రూ.50 కోట్ల వరకూ వసూలు చేయనుండగా.. ఇండియాలో మరో రూ.60 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.. కేరళలో ఈ సినిమా టికెట్లు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే రూ.5 కోట్ల మార్క్ అందుకుంది.ఆదివారం (అక్టోబర్ 15) రాత్రి వరకు బుక్ మై షోలో మొత్తంగా ఇప్పటి వరకూ 12 లక్షల లైక్స్ సంపాదించిన ఈ సినిమా కోసం.. 82 వేలకుపైగా టికెట్లు బుక్ అయ్యాయని సమాచారం.. ఇక చెన్నై మరియు బెంగళూరు నగరాల్లో రిలీజ్ రోజు తెల్లవారుఝామున 4 గంటలకే షోలు ప్రారంభం కాబోతున్నాయి.. ఇక ఈ మూవీ ప్రీమియం టికెట్లు అయితే ఒక్కో టికెట్ ఏకంగా రూ.2400 అమ్ముతున్నారు.ఇక నార్త్ లో కూడా టికెట్ల ధరలు భారీగానే ఉన్నాయి రూ.300 నుంచి రూ.700 వరకూ ఉన్నట్లు తెలుస్తుంది.. దసరా హాలిడేస్ కూడా ఉండటంతో లియో మూవీ రికార్డులు బ్రేక్ చేయడం ఖాయంగా అయితే కనిపిస్తోంది.

Show comments