ఇళయ దళపతి విజయ్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లియో’..ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. విజయ్ సినిమాలు అంటే మార్కెట్ ఓ రేంజులో ఉంటుందన్న విషయం తెలిసిందే.. ఇప్పుడు ఈ సినిమాకు కూడా ఓ రేంజులో బిజినెస్ జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట జోరుగా ప్రచారం చేస్తుంది.. ఈ సినిమాలో ఒక్క సీన్ కే 10 కోట్లు ఖర్చు చేసినట్లు టాక్..
భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా దీన్ని ప్రారంభించాడు లోకేష్. కాబట్టి విజువల్ గ్రాండియర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా యాక్షన్ సీక్వెన్స్‌లను డిజైన్ చేశారు.లోకేష్ యూనివర్స్ లో లియో సినిమా కూడా భాగమేనని అర్థమవుతోంది. ఈ నేపధ్యంలో ‘ఖైదీ’ సినిమా ‘విక్రమ్ మూవీ స్టోరీ’కి ఈ లియో ఒకరకంగా కనెక్ట్ అవుతుందట. సినిమా మొదటి పోస్టర్‌లో హైనా ని హైలైట్ చేశారు.. రెండవ పోస్టర్ లో కూడా అంతకు మించేలా హైనా ల మధ్యలో విజయ్ ఫేస్ కనిపిస్తుంది. ఈ స్టిల్ యాక్షన్ సీక్వెన్స్‌లో భాగంగా తీసింది అని తెలుస్తుంది.
కాగా ఈ హైనాతో ఫైట్ సీన్ కోసం లోకేష్ 10 కోట్ల వరకు ఖర్చు పెట్టాడత. ముఖ్యంగా ఈ సీక్వెన్స్‌ని గ్రాఫిక్స్‌తో డిజైన్ చేశారు.. గ్రీన్ ప్యాడ్ మీద షూట్ చేసి సీజీ వర్క్ అంతా చేస్తారట. ఈ ఫైట్ సీన్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది అంటున్నారు క్రిటిక్స్. హైనా CG లో చాలా వాస్తవమైనదిగా అనిపిస్తుంది.. అందుకోసమే అంత అమౌంట్ ఖర్చు పెట్టినట్లు సమాచారం.. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. ఈ చిత్రంలో ప్రియా ఆనంద్, సంజయ్ దత్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, యాక్షన్ కింగ్ అర్జున్, మాథ్యూ థామస్, మన్సూర్ అలీ ఖాన్ మరియు డ్యాన్స్ మాస్టర్ శాండీ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించగా.. స్క్రీన్ స్టూడియో భారీ స్థాయిలో నిర్మించనుంది.