NTV Telugu Site icon

China: చైనాలో నిమ్మకాయలకు భలే డిమాండ్‌.. కొవిడ్‌తో పోరాడుతున్న డ్రాగన్‌

China Covid

China Covid

China: కరోనా నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా.. చైనా పెరుగుతున్న కేసులు ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి. చైనాలో జీరో కొవిడ్‌ పాలసీని ఎత్తేసిన తర్వాత కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అక్కడ రోజువారీ కేసులు, మరణాలు విపరీతంగా నమోదవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో మళ్లీ కొవిడ్ ముప్పు తప్పదేమోనని నిపుణులు వేస్తోన్న అంచనాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. చైనాలో నిమ్మకాయలకు భారీగా డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం డ్రాగన్‌ దేశం కొవిడ్ మహమ్మారితో పోరాటం కొనసాగిస్తోంది. కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ నుంచి పోరాడేందుకు ఆ దేశ పౌరులు సహజ నివారణల వైపు మొగ్గు చూపడంతో చైనా నిమ్మ రైతులకు వ్యాపారం అకస్మాత్తుగా పుంజుకుంది. చైనాకు చెందిన ఓ రైతు గత వారం రోజుల్లో నిమ్మ విక్రయాలు రోజుకు 20 నుంచి 30 టన్నులకు పెరిగాయని.. గతంలో కేవలం 5 లేదా 6టన్నులు మాత్రమే ఉండేవన్నారు.

బీజింగ్, షాంఘై వంటి నగరాల్లో నిమ్మకాయలకు డిమాండ్ పెరుగుతోందని ఆ రైతు వెల్లజించారు. ఇక్కడ ప్రజలు మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న తాజా యుద్ధంలో వారి రోగనిరోధక శక్తిని పెంచడానికి విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని కొనుగోలు చేయడానికి పరుగెత్తుతున్నారు. జలుబు, ఫ్లూ మందులు తక్కువగా ఉన్నందున, జీరో కొవిడ్ పాలసీని ఎత్తేసిన నేపథ్యంలో సహజంగా మహమ్మారిపై పోరాటం సాగించేందుకు, వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రజలు నిమ్మకాయలను విరివిగా వాడుతున్నారు. ఇదిలా ఉండగా.. విటమిన్ సి కొవిడ్‌కు చికిత్స చేయగలదని లేదా నిరోధించగలదని చెప్పడానికి తగిన ఆధారాలు లేవు.

“గత నాలుగైదు రోజుల్లో నిమ్మకాయల ధరలు రెట్టింపు అయ్యాయి” అని లియు యాంజింగ్ పేరుతో పిలువబడే ఎన్యూలోని మరో రైతు అన్నారు. దేశం నలుమూలల నుండి పెరిగిపోతున్న ఆర్డర్లను ఎదుర్కోవడానికి తాను రోజుకు 14 గంటలు పని చేస్తున్నానని లియు చెప్పారు. స్థానిక మీడియా ప్రకారం.. తాజా ఉత్పత్తులను విక్రయించే ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అయిన డింగ్‌డాంగ్ మైకాయ్‌లో నారింజ, బేరితో సహా ఇతర పండ్ల విక్రయాలు కూడా పెరుగుతున్నాయి.

Rajyasabha: ఖర్గే వ్యాఖ్యలపై దద్దరిల్లిన రాజ్యసభ.. 135 కోట్ల మంది నవ్వుతున్నారంటూ ఛైర్మన్ ఆగ్రహం

ప్రస్తుతం చైనాలో వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండగా.. వైరస్‌ బాధితులతో చైనా ఆసుపత్రులు కిక్కిరిసిపోయయాని అమెరికాలోని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఎరిక్‌ ఫీగెల్‌ డింగ్‌ వెల్లడించారు. అంతేగాక, వచ్చే మూడు నెలల్లో ఆ దేశంలో 60శాతం మందికి పైగా వైరస్‌  బారిన పడతారని నిపుణులు అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ జనాభాలో 10 శాతానికి పైగా కొవిడ్ బారిన పడే ప్రమాదముందని ఆయన అంచనా వేస్తున్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని ఎరిక్ ఫీగెల్‌ డింగ్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఎరిక్‌ చేసిన ట్వీట్ భయాందోళనలు రేపుతోంది.

Show comments