NTV Telugu Site icon

LLC 2024 Auction: రిటైర్మెంట్ అయినా.. వన్నెతగ్గని మాజీ ఆటగాళ్లు..

Llc 2024

Llc 2024

LLC 2024 Auction Full Details: లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2024 సెప్టెంబర్ 20న ప్రారంభమవుతుంది. దీని కోసం ఆగస్ట్ 29, గురువారం వేలం నిర్వహించబడింది. ఇది లీగ్ మూడవ ఎడిషన్ కానుంది. ఇందులో మొత్తం 6 జట్లు ఒకదానితో ఒకటి తలపడతాయి. ఈ వేలం న్యూఢిల్లీలో నిర్వహించారు. ఇందులో పలువురు ప్రముఖ ఆటగాళ్లు పాల్గొన్నారు. దినేష్ కార్తీక్, శిఖర్ ధావన్ నుండి హషీమ్ ఆమ్లా వంటి వెటరన్ ఆటగాళ్లు కూడా ఇందులో ఉన్నారు. ఇకపోతే తాజాగా కొన్ని రోజుల క్రితం శిఖర్ ధావన్ రిటైర్మెంట్ తీసుకున్న సంగతిని తెలిసిందే. అలాగే జూన్ నెలలో పదవీ విరమణ చేసిన తర్వాత దినేష్ కార్తీక్ కూడా ఇటీవల లెజెండ్స్ క్రికెట్ లీగ్‌లో చేరాలని నిర్ణయించుకున్నాడు. ఈ లీగ్‌లో శిఖర్ ధావన్, దినేష్ కార్తీక్‌లు భాగమని నిర్ణయించారు లెజెండ్స్ లీగ్ క్రికెట్ కమిటీ సభ్యులు. అయితే వీటిని ఎంత డబ్బుకు కొనుగోలు చేశారన్న సమాచారం తెలియరాలేదు. ఇక అందిన సమాచారం మేరకు కొందరు ఆటగాళ్లు క్రికెట్ వేలంలో టీమ్స్ కొనుగోలు చేసాయి. ఇక ఏ ఆటగాడు, ఏ టీంకు వెళ్ళాడు.. వారికీ ఎంత చెల్లించనున్నారో చూస్తే..

లెజెండ్స్ లీగ్ క్రికెట్ వేలం విక్రయించిన ఆటగాళ్ల జాబితా..

సౌత్ సూపర్ స్టార్స్:

ఎల్టన్ చిగుంబర – 25 లక్షలు.

హామిల్టన్ మసకద్జా – 23.28 లక్షలు.

పవన్ నేగి – 40 లక్షలు.

జీవన్ మెండిస్ – 15.6 లక్షలు.

సురంగ లక్మల్ – 34 లక్షలు.

శ్రీవత్స గోస్వామి – 17 లక్షలు.

హమీద్ హసన్ – 21 లక్షలు.

నాథన్ కౌల్టర్ నైల్ – 42 లక్షలు.

అర్బన్ రైజర్స్ హైదరాబాద్:

సమీవుల్లా షిన్వారీ – 18.595 లక్షలు.

జార్జ్ వర్కర్ – 15.5 లక్షలు.

ఇసురు ఉదన – 62 లక్షలు.

రికీ క్లార్క్ – 38 లక్షలు.

స్టువర్ట్ బిన్నీ – 40 లక్షలు.

జస్కరన్ మల్హోత్రా – 10.50 లక్షలు.

చాడ్విక్ వాల్టన్ – 60 లక్షలు.

బిపుల్ శర్మ – 17 లక్షలు.

ఇండియా క్యాపిటల్స్:

డ్వేన్ స్మిత్ – 47.36 లక్షలు.

కోలిన్ డి గ్రాండ్‌హోమ్ – 32.36 లక్షలు.

నమన్ ఓజా – 40 లక్షలు.

ధవల్ కులకర్ణి – 50 లక్షలు.

క్రిస్ ఎంఫోఫు – 40 లక్షలు.

కోణార్క్ సూర్యస్ ఒడిశా:

కెవిన్ ఓబ్రెయిన్ – 29.17 లక్షలు.

రాస్ టేలర్ – 50.34 లక్షలు.

వినయ్ కుమార్ – 33 లక్షలు.

రిచర్డ్ లెవీ – 17 లక్షలు.

దిల్షాన్ మునవీర – 15.5 లక్షలు.

షాబాజ్ నదీమ్ – 35 లక్షలు.

ఫిడెల్ ఎడ్వర్డ్స్ – 29 లక్షలు.

బెన్ లాఫ్లిన్ – 23 లక్షలు.

మణిపాల్ టైగర్స్:

షెల్డన్ కాట్రెల్ – 33.56 లక్షలు.

డాన్ క్రిస్టియన్ – 56.95 లక్షలు.

ఏంజెలో పెరీరా – 41 లక్షలు.

మనోజ్ తివారీ – 15 లక్షలు.

అసేల గుణరత్న – 36 లక్షలు.

సోలమన్ మేయర్ – 38 లక్షలు.

అనురీత్ సింగ్ – 27 లక్షలు.

అబు నెచిమ్ – 19 లక్షలు.

అమిత్ వర్మ – 26 లక్షలు.

గుజరాత్ జెయింట్స్:

లియామ్ ప్లంకెట్ – 41.56 లక్షలు.

మోర్నే వాన్ వైక్ – 29.29 లక్షలు.

లెండిల్ సిమన్స్ – 37.5 లక్షలు.

అస్గర్ ఆఫ్ఘన్ – 33.17 లక్షలు.

జెరోమ్ టేలర్ – 36.17 లక్షలు.

పరాస్ ఖడ్కా – 12.58 లక్షలు.

సెక్కుగే ప్రసన్న – 22.78 లక్షలు.

కమౌ లెవెరోక్ – 11 లక్షలు.

సైబ్రాండ్ – 15 లక్షలు.