Site icon NTV Telugu

Lawrence Bishnoi Gang: ఆ వ్యాపార వేత్తను చంపింది మేమే.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సంచలన పోస్ట్..!

Cenada1

Cenada1

Lawrence Bishnoi Gang: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కెనడాలో తీవ్ర భయాందోళనలు సృష్టించింది. సోమవారం కెనడా కొలంబియాలోని దర్శన్ సింగ్ సహాసి (66) ఇంటి వెలుపల జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ బిష్ణోయ్ గ్యాంగ్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో పోస్ట్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సైతం విడుదల చేసింది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు గోల్డీ ధిల్లాన్ ఈ రెండు సంఘటనలకు బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించాడు. వ్యాపారవేత్త దర్శన్ సింగ్ పెద్ద ఎత్తున మాదకద్రవ్యాల వ్యాపారంలో పాల్గొన్నందున తన గ్యాంగ్ హత్య చేసిందని గోల్డీ ధిల్లాన్ పేర్కొన్నాడు. బిష్ణోయ్ గ్యాంగ్ డిమాండ్ చేసిన డబ్బు చెల్లించడానికి నిరాకరించి, వారి ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేశాడని అందుకే చంపేసినట్లు తెలిపాడు.

READ MORE: Horror: యువకుడిని కారు టాప్ పై ఉంచి.. 8 కిలోమీటర్లు లాక్కెళ్లిన డ్రైవర్..

మరోవైపు.. పంజాబీ గాయకుడు చన్నీ నట్టన్ ఇంటిపై సైతం కాల్పులు జరిగాయి. చన్నీ నట్టన్, సర్దార్ ఖేరా సన్నిహితులు. సర్దార్ ఖేరాతో ఉన్న సన్నిహిత సంబంధం కారణంగా లారెన్స్ గ్యాంగ్ గాయకుడు చన్నీ నట్టన్‌ ఇంటిపై కాల్పులు జరిపారు. గాయకుడు చన్నీ నట్టన్ పట్ల తమకు వ్యక్తిగత ద్వేషం లేదని గోల్డీ ధిల్లాన్ పోస్ట్‌లో పేర్కొన్నాడు. సర్దార్ ఖేరాతో నట్టన్‌కు పెరుగుతున్న సాన్నిహిత్యం కారణంగా ఆయనను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపాడు. భవిష్యత్తులో సర్దార్ ఖేరాతో సానిహిత్యం వహించిన ఏ గాయకుడినైనా విడిచి పెట్టమని సంచలన ప్రకటన చేశారు. కాగా.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కార్యకలాపాల కారణంగా కెనడా ప్రభుత్వం ఆ గ్యాంగ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. కెనడాలో బిష్ణోయ్ గ్యాంగ్ హింస, దోపిడీ, బెదిరింపులకు పాల్పడుతున్నందున సెప్టెంబర్ 2025లో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Exit mobile version