పల్నాడు జిల్లాలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా నరసరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ.. ఇచ్చిన ప్రతి హామీని మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని నెరవేర్చిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. గత ప్రభుత్వంలా మానిఫెస్టోను పక్కన పెట్ట లేదు అని ఆయన అన్నారు. వైసీపీ నాలుగున్నర ఏళ్ల పాలనపై ప్రజలు ఆలోచించాలి.. కరోనా సమయంలో ప్రతి కుటుంబాన్ని ఆదుకున్న ప్రభుత్వం జగన్ ది.. ఐదేళ్ల కాలంలో ఎన్నో మంచి పనులు చేశాం.. మెడికల్ కాలేజీ,తీసుకు వచ్చామని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు. పల్నాడులో ప్రతి నియోజక వర్గంలో హైవేలు నిర్మిస్తున్నామని శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. వరిక పుదిసెల ప్రాజెక్ట్ నిర్మించి తీరుతాం.. ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి.. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించాలి అని ఆయన కోరారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పార్టీలు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కోరారు. సీఎం జగన్ చేసిన సంక్షేమ పథకాలే వైసీపీ పార్టీ విజయానికి శ్రీరామ రక్ష అని ఆయన పేర్కొన్నారు.
MP Sri Krishna Devarayalu: ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ నెరవేర్చారు..

Sri Krishnadevarayalu