రాజ్ తరుణ్‌పై పెట్టిన కేసు వాపస్ తీసుకుంటానని లావణ్య తెలిపింది. రాజ్ తరుణ్ పై పెట్టిన కేసులన్నీ వెనక్కి తీసుకుంటానని చెప్పింది.. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడింది. ఇకపై నా పోరాటం మస్తాన్ సాయి పైనే అని చెప్పింది.. మస్తాన్ సాయి తనపై అత్యాచారం చేశాడని.. తనను వంచించినట్టే ఎంతో మంది యువతులను చెరబట్టాడని లావణ్య సంచలన వ్యాఖ్యలు చేసింది.. న్యూడ్ వీడియోలు తీశాడని.. వాటిని పెట్టి బ్లాక్ మెయిల్ చేశాడని తెలిపింది.. తాను మస్తాన్ సాయితో కలిసి పార్టీల్లో పాల్గొన్నట్లు తెలిపింది. అప్పుడు మత్తుమందు కలిపి నాపై అత్యాచారం చేశాడని.. తన హార్డ్ డిస్క్ లో ఆ వీడియోలు చూసినట్లు చెప్పిందిమస్తాన్ సాయి నిజ స్వరూపం బయటపెట్టాలని ధైర్యం చేసినట్లు చెప్పింది. హార్డ్ డిస్క్ తీసుకెళ్ళి కేసు పెట్టినంది.
READ MORE: Nirmala Sitharaman: తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై రాజ్యసభలో నిర్మల సీతారామన్ సంచలన వ్యాఖ్యలు..
“నాకు ప్రాణహాని ఉంది. నేను బతికి ఉంటానో లేదో తెలియదు. మస్తాన్ సాయి, వాళ్ళ పేరెంట్స్ నన్ను చంపేస్తారు.. గడప దాటలంటే భయపడుతున్నా.. నార్సింగ్ DI కి కాల్ చేయాలని మస్తాన్ సాయి చెప్పాడు. నేను కాల్ మాట్లాడుతున్నప్పుడు మస్తాన్ సాయి రికార్డ్ చేశాడు. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో, ఆడియో కూడా అదే.. ఇకపై అన్ని వివాదాలకు పులిస్టాప్ పెడుతున్నా. మస్తాన్ సాయి పై న్యాయపోరాటం చేస్తా.. నన్ను ట్రోల్ చేస్తున్న వారి గురించి పట్టించుకోను. నేను చేస్తున్న పోరాటంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా పట్టించుకోను..” అని లావణ్య కీలక వ్యాఖ్యలు చేసింది.
READ MORE: Graduate MLC election: ఏపీలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు.. బరిలో ఎంతమంది ఉన్నారంటే?