Lava Yuva Smart 2: భారతీయ మొబైల్ బ్రాండ్ లావా (Lava) తన యువ సిరీస్ లో కొత్తగా లావా యువ స్మార్ట్ 2 (Lava Yuva Smart 2) స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. బడ్జెట్ కేటగిరీలో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్ కేవలం రూ.6,099 ధరలో లాంచ్ అయ్యింది. ఈ కొత్త యువ స్మార్ట్ 2 లో 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో పాటు 90Hz రిఫ్రెష్ రేట్ ఉంది. ఈ ఫోన్‌లో UNISOC 9863A ప్రాసెసర్, దీనికి 3GB RAM తో పాటు 3GB వర్చువల్ RAM సపోర్ట్ కూడా ఉంది. అలాగే స్టోరేజ్ పరంగా 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉండగా, మైక్రో SD కార్డ్ ద్వారా 512GB వరకు మెమరీని విస్తరించుకోవచ్చు.
Sandile Wood : మరో డిఫ్రెంట్ సినిమాతో ఆడియెన్స్ ను ఆశ్యర్యపరచబోతున్న వర్శటైల్ యాక్టర్
ఇక కెమెరా విభాగంలో 13MP మెయిన్ కెమెరాతో పాటు AI సెకండరీ కెమెరా ఉంది. ఇందులో పోర్ట్రేట్, HDR, బ్యూటీ మోడ్, నైట్ మోడ్, పానోరమా, స్లో మోషన్, టైమ్ లాప్స్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. సెల్ఫీల కోసం 5MP ఫ్రంట్ కెమెరా అందించారు. 5000mAh బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్‌కు కేవలం 10W ఛార్జింగ్ సపోర్ట్ USB Type-C ద్వారా అందించబడింది. ఇక వీటితో పాటు మొబైల్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, 3.5mm ఆడియో జాక్, FM రేడియో, బాటమ్ స్పీకర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
6.9 అంగుళాల భారీ స్క్రీన్, 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Redmi 15C 4G గ్లోబల్ లాంచ్!
క్రిస్టల్ బ్లూ, క్రిస్టల్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో గ్లాస్ బ్యాక్ డిజైన్‌తో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఇది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని లావా రిటైల్ స్టోర్లలో లభ్యమవుతుంది. అంతేకాకుండా, ఏదైనా విషయంలో మొబైల్ మొబైల్ మొరాయిస్తే.. ఇంటికే వచ్చే సర్వీస్ ఫెసిలిటీ కూడా లావా అందిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్ కొనాలనుకున్న వారికీ ఇది బెస్ట్ ఛాయిస్ కానుంది.
