Site icon NTV Telugu

Lava Days Sale: ‘లావా డేస్ సేల్’ ప్రారంభం.. లావా అగ్ని 3, O3, O3 Pro ఫోన్లపై భారీ డిస్కౌంట్స్!

Lava

Lava

Lava Days Sale: భారతీయ మొబైల్ తయారీ కంపెనీ లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్‌ తాజాగా తమ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా “లావా డేస్ సేల్” ప్రకటించింది. అత్యాధునిక ఫీచర్లు, నమ్మకమైన పనితీరు, భారతీయ వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మొబైల్స్‌ను రూపొందిస్తుందన్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 27 వరకు అమెజాన్ ఇండియాలో ఈ ‘లావా డేస్ సేల్‌’ను నిర్వహిస్తున్నారు. ఇందులో లావా అగ్ని 3, లావా O3, లావా O3 ప్రో స్మార్ట్‌ఫోన్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. మరి ఈ ఫోన్లపై ఉన్న ఆఫర్స్ ఏంటో ఒకసారి చూద్దమా..

లావా అగ్ని 3:
ఈ ఫోన్ ఏప్రిల్ 23 – 25 వరకు ఆఫర్స్ అందుబాటులో ఉంటాయి. ఇందులో భాగంగా.. 8+128 GB (చార్జర్ లేకుండా) అసలు ధర రూ. 20,999 కాగా, రూ. 3,000 కూపన్ డిస్కౌంట్‌తో ఇప్పుడు రూ .17,999కే లభ్యం కానుంది. అలాగే 8+256 GB (చార్జర్‌తో) అసలు ధర రూ. 24,999 కాగా, ఇప్పుడు రూ.3,000 డిస్కౌంట్‌తో రూ.21,999కే లభించనుంది. అలాగే ఏప్రిల్ 26 – 27 వరకు 8+128 GB (చార్జర్ లేకుండా) మొబైల్ అసలు ధర రూ.20,999 కాగా, రూ.2,000 కూపన్ డిస్కౌంట్ + రూ.2,000 బ్యాంక్ ఆఫర్ కలిపి కేవలం రూ.16,999కి లభిస్తుంది. ఇంకా 8+128 GB (చార్జర్‌తో) అసలు ధర రూ.22,999 కాగా, రూ.2,000 కూపన్ + రూ.2,000 బ్యాంక్ ఆఫర్ తో కేవలం రూ.18,999కి లభ్యం అవుతుంది. 8+256 GB (చార్జర్‌తో) అసలు ధర రూ. 24,999 కాగా కూపన్ + బ్యాంక్ ఆఫర్ కలిపి భారీ తగ్గింపుతో రూ.16,999కి రానుంది.

లావా O3:
ఈ ఫోన్ ఏప్రిల్ 23 – 27 వరకు ఆఫర్స్ అందుబాటులో ఉంటాయి. ఇందులో 4+64 GB వేరియంట్ అసలు ధర రూ.6,199 కాగా.. ఇప్పుడు 300 కూపన్ డిస్కౌంట్‌తో రూ.5,899 లకే లభిస్తుంది. అలాగే 3+64 GB వేరియంట్ అసలు ధర రూ.5,799 కాగా.. ఇప్పుడు 150 కూపన్ డిస్కౌంట్‌తో రూ.5,649కి లభిస్తుంది.

లావా O3 Pro:
ఈ మొబైల్స్ ఏప్రిల్ 23 – 27 వరకు ఆఫర్స్ అందుబాటులో ఉంటాయి. ఇందులో భాగంగా 4+128 GB: అసలు ధర 6,999 కాగా., 300 కూపన్ డిస్కౌంట్‌తో కేవలం 6,699కి లభ్యం కానుంది. ఈ లావా డేస్ సేల్ ఏప్రిల్ 23 నుండి 27 వరకు అమెజాన్ ఇండియాలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీ బడ్జెట్‌కు తగ్గ ఫోన్‌ను ఎంచుకోవడానికి ఇదే సరైన సమయం. వినూత్న ఫీచర్లతో కూడిన లావా ఫోన్లను తక్కువ ధరకే అందించేందుకు ఇదే మంచి అవకాశం.

Exit mobile version